,

Temp :Hyderabad : 23.6(°С) Tirupathi : 25(°С) Vijaywada : 26(°С) Visakhapatnam : 28(°С) Guntur : 26(°С) Kakinada : 27.1(°С) Kurnool : 24.9(°С)






img
img
Home    >>
అభివృద్ధి చేయటం కుంభకోణమా ..? టీడీపీ ఆగ్రహం
Posted Date:-6/27/2019 1:25:58 PM

Share

రాష్ట్రం లో గత ఐదేళ్లలో చూపించిన అభివృద్ధిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుంభకోణంగా మారుస్తున్నారని టీడీపీ శ్రేణులు , నాయకులూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ని అప్రతిష్ట పాలు చేయటమే ధ్యేయంగా వైసీపీ నాయకులూ పెట్టుకున్నారని టీడీపీ మాజీ నాయకులూ కళా వెంకటరావు , నారాయణ ధ్వజమెత్తారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రను గాలికి వదిలేశారని నిన్న ఒక ప్రకటనలో మండిపడ్డారు. తానెటూ అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్నానని, టీడీపీపైనా అవినీతి బురదజల్లడం ద్వారా తాను ఒడ్డున పడాలన్న ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలిపారు.


సీఎం చేస్తున్న సమీక్షలు, సమావేశాలు రాష్ట్ర ప్రయోజనాల దృష్టితో కాకుండా ప్రతిపక్షంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ‘బుధవారం ఇంధనరంగం, రాజధానిపై జగన్జరిపిన సమీక్షలు కూడా ఇందులో భాగమే. గతంలో జగన్తండ్రి రాజశేఖర్రెడ్డి హయాంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం(1995-2004)పై 26 విచారణ కమిటీలు నియమించారు. ఇందులో 14 సభసంఘాలు , మూడు మంత్రివర్గ ఉప సంఘాలు నాలుగు జ్యుడీషియల్కమిటీలు, ఒక సీబీసీఐడీ విచారణ జరిగాయి. ఒక్క దానిలో కూడా ఆరోపణా రుజువు చేయలేకపోయారు. ఇప్పుడు మళ్లీ కేబినెట్సబ్కమిటీ వేసి.. చంద్రబాబు ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జరిగిన వాటిపై విచారణ పేరుతో బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పీపీఏలపై జగన్ఆరోపణలన్నీ అసత్యాలే. అవన్నీ ఏపీఈఆర్సీ ద్వారా బహిరంగ విచారణతో పారదర్శకంగా క్రమపద్ధతిలో చేశాం.  అందులో అవకతవకలు లేకుండా దేశంలోనే మెరుగైన పద్ధతుల్లో ప్రక్రియ జరిగిందిఅని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణాన్ని తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, ప్రపంచానికి ఆదర్శ నమూనాగా చేపట్టిందని తెలిపారు. రైతులందరినీ ఒప్పించి 33 వేల ఎకరాలను సమీకరించి భావితరాలకు ఉపయోగపడేలా నిర్మాణాన్ని చేపట్టామని గుర్తుచేశారు.

కాగా ..గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి జాతీయంగా, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ప్రతిష్ఠను పెంచాం. ఇప్పుడు జగన్రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకురావడం, అభద్రత కల్పించడం, పెట్టుబడులు రాకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారుఅని దుయ్యబట్టారు.

 

 




Back to Top
img