,

Temp :Hyderabad : 21(°С) Tirupathi : 18.4(°С) Vijaywada : 25.3(°С) Visakhapatnam : 29.3(°С) Guntur : 24.2(°С) Kakinada : 25.2(°С) Kurnool : 25.7(°С)






img
img
Home    >>
ఏటీఎం ఏ బ్యాంకు నుంచి ఎంత డబ్బులు డ్రా చేసుకోవచ్చంటే..
Posted Date:-10/11/2018 3:08:38 PM

Share

భారతీయ రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు డబ్బులు డ్రా చేసుకొనే విధానం లో కొన్ని పరిమితులను విధించింది.  ఇందులో బ్యాంకింగ్ రంగ దిగ్గజం అయిన ఎస్బీఐ తన ఖాతాదారుల ఎటిఎం లోంచి ఒక్కరోజు మొత్తం డబ్బులను ఒకేసారి డ్రాచేసుకొనే విధానాన్ని మొత్తానికి కుదింపివేసింది.ఎస్బీఐ క్లాసిక్‌ , మాస్ట్రో డెబిట్కార్డులకు ఈనిబంధనలు వర్తిస్తాయి ,అక్టోబర్ 31  నుచి ఈనిబంధనలు అమలులోకివస్తాయి.ఇప్పటివరకు కార్డులతో ఒకే రోజు రూ||40000 వరకు డబ్బులు డ్రా చేసుకునేందుకు వీలుంది.కాని ఇకపై  యస్ బి రూ 20 000  లకు కుదించింది. ఎస్ బి ఖాతాదారులు అధికమొత్తము డబ్బులు డ్రా చేసుకోవాలనుకునేవారు  ఎస్ బి గ్లోబల్ ఇంటర్నేషనల్ కార్డు ద్వారా ఒక రోజులో రూ 50 000  వరకు డ్రా చేసుకోవచ్చు ప్లాటినం ఇంటర్నేషనల్డెబిట్కార్డుదారులు రూ 100000  డబ్బులు డ్రా చేసుకోవచ్చు  మిగతా బ్యాంకు పరిమితుల వివరాలు.ఈవిదంగావున్నాయి


ఐసీఐసీఐ బ్యాంక్‌.. బ్యాంకు చెందిన ఖాతాదారులు  తన ఎటిఎం తో ఒక్కరోజులో రూ 50000 వరకు డ్రాచేసుకోవచ్చు టైటానియం డెబిట్కార్డు దారులు రూ.లక్ష వరకు డ్రా  చేసుకోవచ్చు. స్మార్ట్షాపర్స్గోల్డ్డెబిట్కార్డుదారులు రూ.75,000, స్మార్ట్షాపర్స్సిల్వర్కార్డు దారులు రూ.50,000 వేలుఖాతాదారులు  డ్రా చేసుకొనే అవకాశం ఉంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతాదారులు   ప్లాటినం కార్డుదారులు రోజుకు రూ.50,000, క్లాసిక్కార్డు దారులు రోజుకు రూ.25,000 డ్రా చేసుకోవచ్చు.అలాగే అధికమొత్తం డబ్బులు డ్రా చేసుకొనేందుకు వివిధ రకాల ప్లాటినం డెబిట్ కార్డులను ఇస్తున్నది.

యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులు  టైటానియం ప్రీమియం, ప్లస్డెబిట్కార్డుల ను వుపయోగించి  ఒక్కరోజు వ్యవధిలో రూ 50 000  వరకు డబ్బులు డ్రా చేసుకొనే సదుపాయంవుంది ఇందులోయాక్సిస్బ్యాంక్బుర్గుండీ కార్డు ఉపయోగము తో ఒక్కరోజులో రూ 3 లక్షల రూపాయల వరకు డ్రా చేసుకోవచ్చు.

హెచ్డీఎఫ్ఎసీ బ్యాంక్ఖాతాదారులు  ప్లాటినమ్డెబిట్కార్డువుపయోగించి  రోజుకు రూ.లక్ష వరకు విత్డ్రా చేసుకోవచ్చు. టైటానియం రాయల్డెబిట్కార్డుదారులు రూ.75,000, ఈజీ షాప్డెబిట్కార్డుపై రూ.25,000, రూపే ప్రీమియం డెబిట్కార్డుపై రూ.25,000 ఈజీషాప్టైటానియం డెబిట్కార్డుపై రూ.50,000 వరకు డబ్బులు  డ్రా చేసుకోవచ్చు.

బ్యాంక్బరోడా బ్యాంక్‌ ఖాతాదారులు   రూపే క్లాసిక్కార్డుపై రోజుకు రూ. 25,000 వరకు డ్రా చేసుకోవచ్చు. బరోడా మాస్టర్ప్లాటినం కార్డుపై రూ.50,000, రూపే ప్లాటినం కార్డుపై రూ.50,000, వీసా ఎలక్ట్రాన్కార్డుపై రూ.25,000, మాస్టర్క్లాసిక్కార్డుపై రూ.25,000, వీసా ప్లాటినం చిప్కార్డుపై రోజుకు రూ.లక్ష వరకు విత్డ్రా చేసుకోవచ్చు.




Back to Top
img