,

Temp :Hyderabad :36.3(°С) Tirupathi :35.9(°С) Vijaywada :39.4(°С) Visakhapatnam
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img
Home    >>
ఉదయంలోగా ఎమ్మెల్యేలను సరిహద్దులు దాటించాలి.
Posted On - 17:May:2018 12:26:15 PM
.............................................................................. ..................................................................................

Share

 

బీజేపీ నేత యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉంటే శాసనసభ్యులను కాపాడుకోలేమని కాంగ్రెస్‌, జేడీఎస్‌ లు తమ ఎమ్మెల్యేలను గురువారం ఉదయంలోగా కర్ణాటక సరిహద్దులు దాటించాలనిరెండు పార్టీలు భావిస్తున్నాయి. పాలనా పగ్గాలు బీజేపీ చేతుల్లోకి వెళ్లకముందే శాసనసభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లను ప్రారంభించాయి.

జేడీఎస్‌ ఎమ్మెల్యేలు నగరంలోని షాంగ్రిలా హోటల్లో ఉన్నారు. వీరందర్నీ హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బెంగళూరు బయట ఈగిల్టన్‌ రిసార్ట్‌లోవున్నారు.ముఖ్యంగా కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను బెంబేలెత్తించే కార్యక్రమంలో భాగంగా వారి ఇళ్లపై ఐటీ దాడులు చేయడం జరగొచ్చని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలోనే ఉంచితే పోలీసుల ద్వారా దాడులు చేయించి, ఎమ్మెల్యేలను విడిపిస్తారనే అనుమానం కూడా ఉంది. అందుకే, సురక్షిత మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

 

 

Popular News



Back to Top
img