,

Temp :Hyderabad :36.3(°С) Tirupathi :35.9(°С) Vijaywada :39.4(°С) Visakhapatnam
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img
Home    >>
లాంచీ ప్రమాదంలో 26 మంది మృతి
Posted On - 17:May:2018 12:07:35 PM
.............................................................................. ..................................................................................

Share

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటారు వద్ద పెళ్లి బృందంతో ప్రయాణం చేస్తున్న లాంచీ అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది.ఈ సంఘటన  ఉభయ గోదావరి జిల్లాలను వణికించింది. తమ వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి తరలివచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్, నౌకాదళ సిబ్బంది ఒక్కొక్కటిగా మృతదేహాలను వెలికితీస్తుంటే.. వాటిని గుర్తించిన బంధువుల రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. బుధవారం రెస్య్కూటీం మొత్తం 15 మృతదేహాలను బయటకు తీసింది. ఇంకా 11 మంది ఆచూకీ లేనట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వారికి ఫిర్యాదులు అందాయి. అధికారిక లెక్కల ప్రకారం మరో 16 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అంటే  లాంచీలో 42 మంది ఉన్నట్టు అధికారికంగా తెలుస్తుండగా,  సుమారు 58 మంది లాంచీలో ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంటే అనధికార లెక్కల ప్రకారం మరో 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఎన్‌డీఆర్‌ఎఫ్, నౌకాదళ సిబ్బంది, స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Popular News



Back to Top
img