,

Temp :Hyderabad :36.3(°С) Tirupathi :35.9(°С) Vijaywada :39.4(°С) Visakhapatnam
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img
Home    >>
రాజస్థాన్ కు కళ్లెం వేసిన కోల్‌కతా:
Posted On - 16:May:2018 12:34:43 PM
.............................................................................. ..................................................................................

Share

 కోల్‌కతా రాజస్థాన్ రాయల్స్ విజయాలకు బ్రేక్ వేసింది.ప్లే ఆఫ్ కు చేరువలో వున్నా రాజస్థాన్ కు ఏది ఒక విధంగా పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి.మొదట మ్యాచ్ మంచి స్కోర్ తో ముందుకు వెళ్లిన వాళ్ళ స్పీడ్ కు కులదీప్ యాదవ్ బ్రేక్స్ వేసాడు.చివరకు రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక వీరి ప్లేఆఫ్స్‌ ఆశలకు దాదాపుగా గండిపడినట్టే. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 19 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. బట్లర్‌ (22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39), రాహు ల్‌ త్రిపాఠి (15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌ తో 27) రాణించారు. ఆఖర్లో ఉనాద్కట్‌ (18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 26) కాస్త చెలరేగి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. కుల్దీప్‌కు నాలుగు, ప్రసిద్ధ్‌.. రస్సెల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో కోల్‌కతా 18 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసి గెలుపొందింది. లిన్‌ (42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 45), దినేశ్‌ కార్తీక్‌ (31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 41 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. స్టోక్స్‌కు 3 వికెట్లు పడ్డాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కుల్దీప్‌కు దక్కింది.

Popular News



Back to Top
img