,

Temp :Hyderabad :26(°С) Tirupathi :30.3(°С) Vijaywada :33(°С) Visakhapatnam :29.3(°С)
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img
Home    >>
ఉంగరం తొడిగే లోపే చేజారింది !
Posted On - 14:Sep:2017 12:03:53 AM
.............................................................................. ..................................................................................

Share

ప్రేమికులు తమ ప్రేమను ప్రపోజ్ చేసేందుకు వారికి ఇష్టమైన పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. పార్కు, రెస్టారెంట్ లేదా ఏదైనా పర్యాటక ప్రాంతంలోనో తమ మనసు విప్పి తమ ప్రేమను వెలిబుచ్చుతుంటారు. అమెరికాలోని కాన్సాస్ కు చెందిన సేత్ డిక్సన్ కూడా ఇదే తరహాలో తన ప్రేయసి రూత్ సలాస్ కి తన ప్రేమ విషయం చెబుదామనుకున్నాడు. ఓ శుభముహూర్తం చూసిన డిక్సన్, కాన్సాస్ సిటీలోని లూస్ పార్క్ కు రమ్మనమని రూత్ సలాస్ కు చెప్పాడు. 

అక్కడ వాళ్లిద్దరూ కలుసుకోవడం, ఆ పార్క్ లో ఉన్న ఓ చెక్క వంతెనపైకి చేరడం జరిగింది. అదే సరైన సమయమని భావించిన డిక్సన్, హీరో స్టైల్ లో మోకాలిపై కూర్చుని తన ప్రేమ విషయం ఆమెకు చెప్పాడు. అందుకు సలాస్ ఓకేచెప్పడంతో ఉబ్బితబ్బిబై పోయాడు. తాను ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న సుమారు మూడు వేల డాలర్లు పెట్టి కొనుగోలు చేసిన ఉంగరాన్ని ఆమె చేతి వేలికి తొడుగుదామని చెప్పి, ఆ బాక్స్ ఓపెన్ చేసి తీయబోయాడు.

Back to Top
img