,

Temp :Hyderabad : 28(°С) Tirupathi : 29(°С) Vijaywada : 30(°С) Visakhapatnam : 29(°С) Guntur : 30(°С) Kakinada : 31(°С) Kurnool : 29.5(°С)






img
img

పిచ్చోడు ఆడియో విడుదల చేసిన వరుణ్ సందేశ్, వితిక!!
Posted On - 19:Nov:2019 04:46:29 PM
.............................................................................. ..................................................................................

Share

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియాలో మరియు బయట మంచి రెస్పాన్స్ లభిస్తోంది. క్రాంతి, కె.సీమర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, సమీర్, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి,  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ మూవీ నవంవర్ 22న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఆడియోను వరుణ్ సందేశ్, వితిక విడుదల చేశారు.

 

ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.  హీరో క్రాంతికి ఈ సినిమాతో మంచి పేరు తెచ్చిపెట్టె అవకాశాలు ఉన్నాయని వరుణ్ సందేశ్ తెలిపాడు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్త్సైన్మెంట్ చిత్రాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయని, ఈ మూవీలో నటించిన నటీనటులందరికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 

 

నటీనటులు: క్రాంతి, కె.సీమర్, పోసాని కృష్ణమురళి, సమీర్, సత్య కృష్ణ, అభయ్, అప్పారావు, మహేష్, దుర్గ.

బ్యానర్: హేమంత్ ఆర్ట్స్

కథ - స్క్రీన్ ప్లే - నిర్మాత - దర్శకత్వం: హేమంత్ శ్రీనివాస్

సంగీతం: బంటి

బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శ్రీ వెంకట్, శివ

ఎడిటర్: సంతోష్ గడ్డం

కెమెరామెన్: గోపి అమితాబ్

Popular News


Current News

Back to Top
img