,

Temp :Hyderabad : 28(°С) Tirupathi : 29(°С) Vijaywada : 30(°С) Visakhapatnam : 29(°С) Guntur : 30(°С) Kakinada : 31(°С) Kurnool : 29.5(°С)






img
img

'90ml' 'సింగిలు సింగిలు' పాట విడుదలకి భారీ స్పందన!!
Posted On - 18:Nov:2019 01:26:38 PM
.............................................................................. ..................................................................................

Share

హీరో కార్తికేయ నటించిన 90ml 'సింగిలు సింగిలు' పాటని భారీ జనసందోహం మధ్య ఫోరమ్ సుజనా మాల్ లో 17 నవంబర్ శనివారం రాత్రి హైదరాబాద్ విడుదల చేశారు.

 

ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ చిత్రంలో నటించిన రోల్ రైడా మరియు దర్శకుడు శేఖర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటంతో ప్రాంగణమంతా ఈలలు, అరుపులతో ఉర్రూతలూగిపోయింది.

 

ఇదివరకు విడుదలైన 'ఇనిపించుకోరు ఇనిపించుకోరు' 'చాలు చాలు' పాటలు ఇప్పటికే జనాల నుండి మంచి ఆదరణ పొందుతుండగా ఇప్పుడు విడుదలయిన ఈ పాట సింగిలు సింగిలు అని సాగుతూ సింగిల్ యువతని విపరీతంగా ఆకట్టుకోనుంది.

 

ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి గుమ్మకొండ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తుండగా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలకి సిద్ధంగా ఉంది.

 

న‌టీన‌టులు:

కార్తికేయ‌, నేహా సోలంకి, ర‌వికిష‌న్‌, రావు ర‌మేష్‌, అజయ్ , ఆలీ , ప్ర‌గ‌తి, ప్ర‌వీణ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, అదుర్స్ ర‌ఘు, స‌త్య ప్ర‌కాష్‌, రోల్ రిడా, నెల్లూర్ సుద‌ర్శ‌న్‌, దువ్వాసి మోహ‌న్‌.

 

సాంకేతిక నిపుణులు:

రచన-దర్శకత్వం

శేఖర్ రెడ్డి ఎర్ర ,సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా:  జె.యువ‌రాజ్‌, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్:  జీఎం శేఖ‌ర్‌, పాట‌లు:  చంద్ర‌బోస్‌, ఫైట్స్:  వెంక‌ట్‌, జాషువా, కొరియోగ్ర‌ఫీ:  జానీ, కో-డైరెక్టర్

బాస్ గూడూరి(సిద్ధు) , ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  కె.సూర్య‌నారాయ‌ణ‌.

Popular News


Current News

Back to Top
img