,

Temp :Hyderabad : 24.8(°С) Tirupathi : 28(°С) Vijaywada : 29(°С) Visakhapatnam : 28(°С) Guntur : 29(°С) Kakinada : 29(°С) Kurnool : 26.7(°С)






img
img

ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్న మహేష్ బాబు !
Posted On - 21:Sep:2019 12:53:06 PM
.............................................................................. ..................................................................................

Share

భారతీయ చలన చిత్ర రంగంలో బహుముక ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న దాదాసాహెబ్ పాల్కే 150 జయంతి సందర్భంగా దాదాసాహెబ్ పాల్కే ఫిలిం ఫెస్టివల్ ను అంగరంగ వైభవంగా హైదరాబాద్ , ముంబై , ఢిల్లీ లో కార్యక్రమం నిర్వహించారు . అయితే తొలిసారిగా హైదరాబాద్ లో అవార్డుల కార్యక్రమం జరిగింది . కార్యక్రమానికి సినీ ప్రముఖులు , సాంకేతిక నిపుణులు భారీ స్థాయిలో హాజరయ్యారు . కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ గవర్నర్ తమిళశై సౌందర్య రాజన్ హాజరయ్యారు . భారత సినిమా అభివృద్ధిలో దక్షిణాది సినిమాలు ఎంతో కిలపాత్ర పోషిస్తున్నాయని గవర్నర్ అన్నారు .

ఇక ఫెస్టివల్ లో ఉత్తమ నటుడుగా ' భరత్ అనే నేను ' చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కు అవార్డు వరించింది . తెలంగాణ గవర్నర్ తమిళశై  చేతులు మీదగా మహేష్ బాబు సతీమణి నమ్రత అవార్డును స్వీకరించారు . అదే విధంగా సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా అవార్డు వరించింది . ఆయనకు జీవిత సాఫల్య అవార్డు దక్కింది . ఫంక్షన్ ఎన్ కన్వెంక్షన్ లో జరిగిన  అవార్డు ఫంక్షన్ కి మంచు లక్ష్మి , అవికా గోర్  , అవంతిక మిశ్రా , అనూప్ సింగ్ ఠాకూర్ , దర్శకుడు అల్లు బేబీ తదితరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు .

 

Popular News


Current News

Back to Top
img