,

Temp :Hyderabad : 24.3(°С) Tirupathi : 27(°С) Vijaywada : 28(°С) Visakhapatnam : 27(°С) Guntur : 28(°С) Kakinada : 28(°С) Kurnool : 26.8(°С)






img
img

ANR BIRTHDAY ! ఎమోషనల్ ట్విట్ చేసిన నాగ్
Posted On - 20:Sep:2019 05:28:35 PM
.............................................................................. ..................................................................................

Share

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ లు రెండు కళ్లులు లాంటి వారు . వారి వల్లే తెలుగు చిత్ర రంగం స్థాయిలో ఉంది . ఇక ఈరోజు అక్కినేని నాగేశ్వరావు గారి పుట్టిన రోజు . ఆయనది చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన పాత్ర . ఆయన , ఎన్టీ రామారావు గారు ఎన్నో చిత్రాలు చేసి విజయ గంటలు మ్రోగించారు. అంతేకాకుండా కథానాయకుడుగా 244 చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించి అలరించారు. 1924 సెప్టెంబర్ 20 కృష్ణా జిల్లాలోని రామాపురంలో జన్మించారు నాగేశ్వరరావు. 1941లో వచ్చినధర్మపత్నిసినిమాతో తన కెరీర్ను ప్రారంభించారు నాగేశ్వరావు గారు .   ప్రేమాభిషేకం , దేవదాస్ , ప్రేమ్ నగర్ , దసరా బుల్లోడు , గుండమ్మ కథ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు. చిత్రాలు ఇప్పటి ట్రెండ్ కూడా ఎవర్ గ్రీన్  గా ఉన్నాయి .

అయితే ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున ట్విటర్ వేదికగా వారి తండ్రిగారికి ఎమోషనల్ గా పుట్టిన రోజు విషెస్ తెలియజేసారు . " ‘ANRliveson.. ఈరోజు నాన్న పుట్టినరోజు. మమ్మల్ని మీ జీవితంలో భాగస్వామ్యులుగా చేసుకున్నందుకు థ్యాంక్యూ. మిమ్మల్ని మిస్సవుతాం. మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాంఅని పేర్కొన్నారు."

అక్కినేని కోడలు సమంత కూడా ఏఎన్నార్ను గుర్తుచేసుకున్నారు. తన ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్లో ఏఎన్నార్ నటించిన సినిమల్లోని పాత్రలన్నీ కలిపిన ఫొటోలన్నీ కలిపి ఉన్న ఇమేజ్ను పెట్టుకున్నారు. ఏఎన్నార్ మనవడు, నటుడు సుశాంత్ కూడా తన తాతగారితో ఉన్న అనుబంధాలను ట్విటర్లో పంచుకున్నారు. చిన్నప్పుడు తన తాతగారితో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్డే తాతా.. నేను మీ జీవితంలో కొంతకాలమే భాగమై ఉన్నప్పటికీ ఎంతో గొప్పగా ఫీలవుతున్నాను. మరింత కష్టపడేలా మీరు మాలో స్ఫూర్తి నింపారు. మీరు మా హృదయాల్లో చిరకాలం నిలిచిపోతారుఅని పేర్కొన్నారు.

 

Popular News


Current News

Back to Top
img