,

Temp :Hyderabad : 24.8(°С) Tirupathi : 28(°С) Vijaywada : 29(°С) Visakhapatnam : 28(°С) Guntur : 29(°С) Kakinada : 29(°С) Kurnool : 26.7(°С)






img
img

నాగ్ ఫామ్ హౌస్ లో మృతదేహం ! అసలేం జరిగిందంటే
Posted On - 20:Sep:2019 01:28:33 PM
.............................................................................. ..................................................................................

Share

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో కనిపించిన మృతదేహం ఎవరిదో పోలీసులు గుర్తించారు .  నాలుగేళ్లుగా కనిపించకుండా పోయిన పాపిరెడ్డిగూడకు చెందిన పాండు (32)ది అని తేలింది . అక్కడే తానూ గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు . పోలీసుల వివరాల ప్రకారం.. చిన్న అంజయ్య-జంగమ్మ దంపతుల నలుగురు సంతానంలో పాండు చిన్నవాడు. అవివాహితుడు. మూడో అన్న కుమార్అంటే పాండుకు అమితమైన ఇష్టం. కుమార్అనారోగ్యంతో మృతిచెందిన నాటి నుంచి పాండు కుంగిపోయాడు. తనకు దేనిమీదా ఆశలేదని సోదరులకు చెప్పాడు.

 అనంతరం లేఖ రాసి.. చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత పాండు కోసం కుటుంబసభ్యులు చాలాచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. అతడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. రంగారెడ్డి జిల్లా పాపిరెడ్డిగూడలోని వ్యవసాయ క్షేత్రంలో చాలా ఏళ్లుగా పనులేవీ జరగడం లేదు. వారం క్రితం వ్యవసాయ క్షేత్రానికి నాగార్జున సతీమణి అమల వెళ్లారు. సేంద్రియ పద్ధతిలో సాగు పనులు చేపట్టేందుకు కొందరిని పురమాయించారు. బుధవారం సాయంత్రం అక్కడికి కొందరు వ్యక్తులు వచ్చారు. అదే గ్రామానికి చెందిన బుద్దోలు శ్రీశైలం.. షెడ్డులోకి వెళ్లి చూడగా అస్థిపంజరం కనిపించింది. మృతదేహంపై దుస్తులు మాత్రమే మిగిలాయి. గురువారం శంషాబాద్డీసీపీ ప్రకాశ్రెడ్డి, షాద్నగర్ఏసీపీ సురేందర్‌, షాద్నగర్రూరల్సీఐ రామకృష్ణ పరిశీలించారు. జేబులో ఆధార్కార్డు కార్డు ఆధారంగా మృతుడిని పాండుగా గుర్తించారు.

 

 

Popular News


Current News

Back to Top
img