,

Temp :Hyderabad : 24.6(°С) Tirupathi : 28(°С) Vijaywada : 29(°С) Visakhapatnam : 28(°С) Guntur : 29(°С) Kakinada : 29(°С) Kurnool : 26.7(°С)






img
img

వాల్మీకి చిత్ర టైటిల్ ' గడ్డలకొండ గణేష్ ' గా మార్పు
Posted On - 20:Sep:2019 12:34:01 PM
.............................................................................. ..................................................................................

Share

ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ' వాల్మీకి ' చిత్ర టైటిల్ ' గడ్డలకొండ గణేష్ ' గా  మారుస్తున్నట్లు చిత్ర యూనిట్ గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ .. బోయ వాల్మీకి సామజిక వర్గం నుండి వ్యక్తిగతమైన ఆందోళన నేపథ్యం లో ఇక ఈ చిత్రం పేరు గద్దెలకొండ గణేష్ గా మారుస్తున్నట్లు తెలిపారు . ఈ మేరకు గురువారం హైదరాబాద్ లోని మీడియా సమావేశంలో మాట్లాడారు.

 

వాల్మీకి ' టైటిల్ ప్రకటించినప్పటి నుండి వ్యక్తిగతంగా కొందరు నిరసనలు చేపట్టారు. చిత్రంలో వాల్మీకి మహర్షి ఎక్కడ తప్పు చేసినట్లు ఎక్కడ చూపించలేదు . ఎవరైతే నిరసనలు చేపట్టారో , ఎవరైతే టైటిల్ పెట్టినందుకు మనోభావాలు దెబ్బతీశాయి అన్నారో వాళ్లే చిత్రం చూసి ఖశ్చితంగా మమ్మల్ని మెచ్చుకుంటారు అనే నమ్మకంతో ఉన్నాం . అలాగే ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెన్సార్ పరిధిలోకి వస్తుందనుకున్నాం . సెన్సార్ సభ్యులు సినిమా చూసి  వాళ్లే అన్నారు . వాల్మీకి మహర్షి గురించి ఎక్కడ చూపించలేదని అన్నారని సమస్య కు పరిష్కారం లభించిందనుకున్నాం. అయితే బోయ సంఘం వారు , వాల్మీకి వర్గం వారు టైటిల్ లో తుపాకీ ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు దాన్ని మార్చాం . మేరకు మొట్టమొదటి సారిగా ఓడిపోయామని అనిపిస్తుంది.

' ఓడిపోవడం అంటే ఒక వ్యక్తిగతం గానో , ఒక డైరెక్టర్ గానో , ఒక రైటర్ గానో కాదు .., ఒక హైందవ సమాజానికి చెందిన వ్యక్తిగా ఒక వాల్మీకి మహర్షి మీద ఉన్న ఒక గొప్ప గౌరవాన్ని  , ఒక మంచి విషయాన్ని ముందుకు తీసుకువెళ్లడం లో ఓడిపోయానని నాకు అనిపిస్తుంది అన్నారు . '

అయితే శుక్రవారం విడుదల  నేపధ్యంలో అనంతపురం , కర్నూల్ జిల్లా కలెక్టరేట్ నుండి మాకు సినిమాను నిలిపివేయాలని ఉత్తర్వులు వచ్చాయి . సమస్య  ఇంతవరుకు తీసుకువచ్చారని బాధ అందరిలోనూ ఉంటుంది. సమస్యను ఎలా అధిగమించాలో నేను మా నిర్మాతలు 14 - 15 పాటు ఆలోచించాం. పరిస్థి కావాలని ఎవరు తెచ్చుకోరు. ఇలాంటి టైటిల్ పెట్టినందుకు వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని నలుగురికి తెలుస్తుంది అనుకున్నాం. 30 - 40 కోట్ల ఖర్చు పెట్టి 200 టెక్నిషియన్స్ సినిమా ఫై పని చేస్తూ ఒక వ్యక్తిని గాని , ఒక వర్గాన్ని , ఒక కులాన్ని గాన్ని , ఒక సంఘాన్ని గాని విమర్శించడానికి చిత్ర తీయలేదు. సినిమా చూడకుండగానే ఎవరికీ  ఎలా క్షమాపణలు చెప్పాలో నాకు అర్ధం కావడం లేదు. జిల్లాల్లో అయితే సినిమా నిలిపివేయాలని అనుకున్నారో జిల్లాల్లో సినిమాను కొన్న  డిస్ట్రిబ్యూటర్స్ తీవ్రంగా నష్టపోతారు. వారికి ఇలాంటి నష్టం జరగకూడదని భావించాం. నేను ముందు ఒక దేశ పౌరుడిని .. తరువాతే డైరెక్టర్ ని , రైటర్ ని . వ్యక్తి కూడా ప్రభుత్వానికి అతీతంగా వెళ్లారని నమ్మే వ్యక్తిని నేను . అందిరికి చెప్పేది ఒకటే .. వాల్మీకి టైటిల్ ను గడ్డలకొండ గణేష్ గా పరిగణించాలని కోరుతూ  టైటిల్ మారుస్తున్నాం . ప్రచార సామాగ్రి అంత కొత్త టైటిల్ తోనే వస్తుందని అన్నారు .

ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వారికీ నేను చెప్పేది ఒకటే .. బోయ , వాల్మీకి సోదరులారా మీరు మా సినిమాను చూడాలని కోరుతున్నాం. సినిమా చుసిన తరువాత ఎక్కడో ఎదో మూలా వాల్మీకి మహర్షి గురించి ఎక్కడ తప్పుగా చూపించలేదని మీ అంతరాత్మకు అనిపిస్తే అదే చాలు. అందరూ సహకరించాలని కోరుతున్నాం  అని అన్నారు .

 

Popular News


Current News

Back to Top
img