,

Temp :Hyderabad : 31.9(°С) Tirupathi : 34(°С) Vijaywada : 34(°С) Visakhapatnam : 33(°С) Guntur : 34(°С) Kakinada : 35(°С) Kurnool : 31.6(°С)






img
img

సూరత్ అగ్నిప్రమాదం ! బిల్డర్లపై హత్య కేసు
Posted On - 25:May:2019 12:43:43 PM
.............................................................................. ..................................................................................

Share

శుక్రవారం సాయంత్రం గుజరాత్ రాష్ట్రం సూరత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. ఘటన సూరత్ తక్షశిల కాంప్లెక్స్ , కోచింగ్ సెంటర్ లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మేరకు కోచింగ్ వెళ్లిన 20 మంది ప్రాణాలు కోలుపోయారు. ప్రాణాలు కాపాడేందుకు భవనం ఫై నుండి దూకేయడం తో ప్రాణాలు కోల్పోయారు. కొందరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  దీనంతటికి కారణం బిల్డింగ్ కి ఎంట్రీ , ఎగ్జిట్ దారులు ఒకటే ఉంటటం వలెనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

బిల్డింగ్ కి పై అంతస్థులకు వెళ్లేందుకు చెక్కలతో చేసిన మెట్ల మార్గం మాత్రమే ఉంది. అగ్ని ప్రమాదంలో చెక్కమెట్లు తగలబడటంతో విద్యార్థులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. భవనంలో కోచింగ్ క్లాసులు చెబుతున్న క్లాస్ ఆపరేటర్ భార్గవ్ బుటానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ యాజమాన్యం అయిన ఇద్దరు బిల్డర్స్ హర్షల్ వికారియా, జిగ్నేష్పై హత్య కేసు నమోదైంది. పోలీసులు వాళ్ళ కోసం గాలిస్తున్నారు.

 

Popular News


Current News

Back to Top
img