,

Temp :Hyderabad : 31.6(°С) Tirupathi : 35(°С) Vijaywada : 36(°С) Visakhapatnam : 33(°С) Guntur : 36(°С) Kakinada : 36(°С) Kurnool : 33.5(°С)






img
img

మొత్తం సైలెంట్ అయిన టీడీపీ కేడర్
Posted On - 25:May:2019 12:17:39 PM
.............................................................................. ..................................................................................

Share

మొన్న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ కి తీరని నష్టం వాటిల్లింది. వైసీపీ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు 150 స్థానాలు గెలిచి అఖండ విజయం సొంతం చేసుకుంటే , టీడీపీ కేవలం 23 స్థానాలు పరిమితం అయి ఘోర పరాజయం పాలయింది. దింతో టీడీపీ తముళ్లు ఒక్కసారిగా కిండ్రాఫ్ సైలెన్స్ అయిపోయారు. ఈ ఎన్నికల్లో గెలుపు తధ్యం అనుకున్నాము ..ఓడిపోయినా 15 సీట్స్ కి వెనుక పడవచ్చని అనుకున్నాము , కానీ ఇంత ఘోరమైన పరాజయానికి వెళ్లిపోతామని అనుకోలేదని టీడీపీ తముళ్లు వాపోతున్నారు. ఈ మేరకు కొంతమంది విజేతలను , పరాజితులను కలిసి చంద్రబాబు నాయుడు ఆవేదన పంచుకున్నారు.

 

ఓటమి కంటే , ఓడిన తీరుపై చంద్రబాబు విస్మయం చెందుతున్నారు. మనం నిజంగా... అంత ఘోరమైన తప్పిదాలు చేశామా? ప్రజలను కష్టపెట్టామా?’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన రాజప్ప, గద్దె రామ్మోహన్‌, మద్దాలి గిరి, మాజీలు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, తెనాలి శ్రావణ్కుమార్‌, జీవీ ఆంజనేయులు, పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తదితరులు చంద్రబాబును కలిశారు. మీరు ఐదేళ్ల పాటు ఎంత చాకిరీ చేశారో పలువురు పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మనం పడిన కష్టం ప్రజలకు తెలుసునని , ఫలితాలపై మరో సారి సమీక్షచాలని ,ఏవి ఎలాంటి ప్రభావం చూపాయో తెలుసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

ఎక్కడ దెబ్బ తిన్నాం... ఎందుకిలా జరిగిందన్నదానిపై విశ్లేషణలు జరుపుతున్నారు. పోయిన ఎన్నికల్లో పార్టీకి అత్యధికంగా సీట్లు ఇచ్చిన కోస్తా ప్రాంతానికి సంబంధించి రెండు అంశాలు బాగా ప్రభావం చూపాయని వారిలో కొందరు చెబుతున్నారు. ‘‘జనసేన విడిగా పోటీచేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని అనుకొన్నాం. కానీ, అది జరగలేదు. టీడీపీకి పవన్సన్నిహితుడనే ప్రచారం జరగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్కే వెళ్లిపోయింది. టీడీపీకి రావాల్సిన ఓట్లు భారీగా జనసేనకు పడ్డాయి. ఉదాహరణకు విశాఖ ఎంపీ సీటు టీడీపీ ఖాయంగా గెలుచుకోవాల్సి ఉంది. జనసేన పోటీతో చాలా స్వల్ప తేడాతో పోగొట్టుకోవాల్సి వచ్చింది. కనీసం పాతిక ముప్ఫై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి నష్టం జరిగింది’’ అని పార్టీ నేతలు చెబుతున్నారు.

 

Popular News


Current News

Back to Top
img