,

Temp :Hyderabad : 31.4(°С) Tirupathi : 34(°С) Vijaywada : 34(°С) Visakhapatnam : 34(°С) Guntur : 34(°С) Kakinada : 35(°С) Kurnool : 33.5(°С)






img
img

మోడీ ప్రమాణస్వీకారానికి విదేశీ నేతలు
Posted On - 25:May:2019 12:14:53 PM
.............................................................................. ..................................................................................

Share

సార్వత్రిక ఎన్నికల్లో రెండో సారి అఖండ విజయం సాధించిన భాజపా నేతృత్వం లో ఎన్డీయే కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధంమవుతుంది. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని పీఠాన్ని అవరోధించనున్నారు. అయితే మే 30 న నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ కార్యక్రమానికి విదేశీ నేతలు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ విషయం ఫై విదేశీ నేతలను ఆహ్వానించే దిశగా కార్యకర్తలతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

భారత్పొరుగున్న ఉన్న దేశాల అధినేతలతో పాటు, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాల అధ్యక్షులను ఆహ్వానించే అవకాశాలున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌, జపాన్ప్రధాని షింజో అబే, అబుదబీ యువరాజు, ఇజ్రాయెల్ప్రధాని బెంజిమన్నెతాన్యాహూతో ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. వీరిని కూడా ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఐక్యరాజ్యసమితి పీ-5 దేశాల అధినేతలను ఆహ్వానిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నారు. పీ-5 అంటే ఐరాసలో శాశ్వత సభ్య దేశాలైన యూఎస్‌, చైనా, రష్యా, ఫ్రాన్స్‌, యూకే దేశాలు. అయితే దీనిపై భాజపా నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

 

Popular News


Current News

Back to Top
img