,

Temp :Hyderabad : 31.9(°С) Tirupathi : 34(°С) Vijaywada : 34(°С) Visakhapatnam : 33(°С) Guntur : 34(°С) Kakinada : 35(°С) Kurnool : 31.6(°С)






img
img

జగన్ శాసనసభ పక్ష నేతగా.. ఎన్నిక నేడే
Posted On - 25:May:2019 12:12:23 PM
.............................................................................. ..................................................................................

Share

రాష్ట్రం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వైకాపా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. నేడు శాసనసభ పక్షం   ఉదయం 10 .31 గంటలకు భేటీ కానుంది. మంత్రులంతా కలిపి ఏకగ్రీవంగా జగన్ ను శాసనసభ పక్షనేతగా  ఎన్నుకోనుంది. ఒక్క అజెండాతోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. తాడేపల్లిలో జగన్క్యాంపు కార్యాలయంలో జరగనున్న సమావేశంలో జగన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానించనున్నారు. తీర్మాన ప్రతిని సాయంత్రం నాలుగున్నరకు హైదరాబాద్లో రాష్ట్ర గవర్నర్నరసింహన్కు సమర్పించనున్నారు. ఎమ్మెల్యేల బృందంతో కలిసి వెళ్లి జగన్గవర్నర్కు ప్రతిని అందజేయనున్నారు.

శాసనసభ పక్ష సమావేశం అయినవెంటనే ఉదయం 11.30 నిమిషాలకు వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.  పార్టీ అధ్యక్షుడు జగన్నేతృత్వంలో జరగనున్న భేటీలో పార్టీ పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. రెడ్డిలకు కాకుండా వేరే సామాజికవర్గానికి పదవిని కట్టబెట్టాలని జగన్నిర్ణయించారని పార్టీ వర్గాలు తెలిపాయి. క్రమంలో మచిలీపట్నం ఎంపీగా ఎన్నికైన వల్లభనేని బాలశౌరి పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. జగన్కు సన్నిహితుడవడం, పారిశ్రామికవర్గాలతో పరిచయాలు ఉండడం వంటివన్నీ బాలశౌరికి కలిసొచ్చిన అంశాలని పార్టీ నేతలు చెబుతున్నారు. మహిళా ఎంపీల్లో ఒకరికి అవకాశాన్ని ఇవ్వడంపైనా చర్చ జరుగుతోంది.

కాగా .. ఈనెల 30 జగన్ ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారు చేయనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్థలాభావం, ట్రాఫిక్ఇబ్బందులు, పార్కింగ్సమస్యలున్నాయని శుక్రవారం అధికారులు గుర్తించారు. వేదిక ఎక్కడనేదీ శనివారం తుదిగా ఖరారు చేయనున్నారు.

 

Popular News


Current News

Back to Top
img