,

Temp :Hyderabad : 31.6(°С) Tirupathi : 34(°С) Vijaywada : 34(°С) Visakhapatnam : 34(°С) Guntur : 34(°С) Kakinada : 35(°С) Kurnool : 33.5(°С)






img
img

గుజరాత్ లో ఘోర అగ్ని ప్రమాదం
Posted On - 24:May:2019 09:02:43 PM
.............................................................................. ..................................................................................

Share

గుజరాత్లోని సూరత్లో సర్తానా ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోచింగ్సెంటర్భవనం రెండో అంతస్తులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. కొద్దిక్షణాల్లోనే అవి తీవ్ర రూపం దాల్చాయి. దుర్ఘటనలో ఇప్పటివరకు 17 మంది మృతిచెందినట్టు సమాచారం.  ప్రాణాల్ని కాపాడుకొనే క్రమంలో పలువురు విద్యార్థులు భవనంపైనుంచి కిందకు దూకేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సూరత్నగర పోలీస్కమిషనర్తెలిపారు. ఘటనా స్థలంలో 18 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేస్తున్నారు.

సూరత్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. మేరకు ఆయన ట్విటర్లో స్పందించారు. ‘సూరత్లో జరిగిన భయానక అగ్ని ప్రమాదం నన్నెంతో కలిచివేసింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. బాధితులను సత్వరమే ఆదుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని, స్థానిక అధికారులను కోరాఅని మోదీ పేర్కొన్నారు.  మరోవైపు, ఘటనపై సీఎం విజయ్రూపానీ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.

 

Popular News


Current News

Back to Top
img