,

Temp :Hyderabad : 31.9(°С) Tirupathi : 34(°С) Vijaywada : 34(°С) Visakhapatnam : 33(°С) Guntur : 34(°С) Kakinada : 35(°С) Kurnool : 31.6(°С)






img
img

శ్రీజా ఆర్ట్స్ నూతన చిత్రం ‘ఇట్లు’ షూటింగ్ ప్రారంభం
Posted On - 24:May:2019 06:47:07 PM
.............................................................................. ..................................................................................

Share

‘ఓ యువ రైతు తన గ్రామంలోని రైతులందరికి మంచి నాణ్యమైన విత్తనాలు అందిస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని జీవితంలో సెటిల్‌ అవ్వాల‌నుకుంటాడు. ఇంతలో అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? హత్య కేసులో ఎందుకు ఇరుక్కున్నాడ‌నేది  తెలియాలంటే మా ‘ఇట్లు’ సినిమా చూడాల్సిందే’ అని అంటున్నారు దర్శకుడు రోశి రెడ్డి పందిళ్ళ‌ప‌ల్లి. అమీర్‌, శిరీష, అశ్విత హీరోహీరోయిన్లుగా రోశి రెడ్డి పంది ళ్ళపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇట్లు’. శ్రీజా ఆర్ట్స్‌ పతాకంపై రాజగౌడ్ పుదారీ, మెట్టయ్య వుప్పల‌, డా॥రఘు, డా॥శ్రీరాములు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది.  హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు నారాయణరావు క్లాప్ నివ్వగా, శ్రీమతి వాణి(ఎం ఎఫ్ టి ఐ) కెమెరా స్విచాన్‌ చేశారు. మద్దూరి వెంకట కృష్ణ మోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. 

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్ర దర్శకుడు రోశి రెడ్డి మాట్లాడుతూ, ‘మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వ శాఖలో శిక్షణ తీసుకున్నాను.  రెండు, మూడు ల‌ఘు చిత్రాల‌ను రూపొందించాను. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారుతున్నా. యాక్షన్‌, థ్రిల్ల‌ర్‌, రొమాన్స్‌, కామెడీ అంశాల‌ మేళవింపుగా సినిమాని రూపొందిస్తున్నా. ‘ఇట్లు’ టైటిల్‌ ఎందుకు పెట్టామనేది సస్పెన్స్‌. ద‌ర్శ‌కుడిగా నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కు, అలాగే  మా గురువులు మద్దూరి వెంకట కృష్ణమోహన్‌, నారాయణరావుల‌కు ధన్యవాదాలు’ అని అన్నారు. 

నటుడు నారాయణరావు మాట్లాడుతూ, ‘నేను, కృష్ణమోహన్‌ మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఫ్యాకల్టీగా పనిచేశాం. మా శిష్యుడు ఈ సినిమాని రూపొందించడం ఆనందంగా ఉంది. కొత్తవారిని తెలుగు పరిశ్రమ, ప్రేక్షకులు ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ఈ టీమ్‌ని ఎంకరేజ్‌ చేయాల‌ని కోరుకుంటున్నా’ అని అన్నారు. 

 మద్దూరి వెంకట  కృష్ణ మోహన్‌ చెబుతూ, ‘రోశి రెడ్డి తన స్నేహితుల‌ సహకారంతో ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి’ అని చెప్పారు. 

Popular News


Current News

Back to Top
img