,

Temp :Hyderabad : 31.4(°С) Tirupathi : 35(°С) Vijaywada : 36(°С) Visakhapatnam : 33(°С) Guntur : 36(°С) Kakinada : 36(°С) Kurnool : 33.5(°С)


img
img

ఎన్.జి.కె చిత్ర ప్రీ రిలీజ్ ఫంషన్ డేట్ ఫిక్స్
Posted On - 24:May:2019 04:41:51 PM
.............................................................................. ..................................................................................

Share

తమిళ్ తో పాటు తెలుగు లో గజినీ , సింగం పలు చిత్రాలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు హీరో సూర్య . ఇప్పుడు తాజాగా ఆడువారు మాటలకు అర్ధాలే వేరులే , 7 /జి బృందావన కాలనీ ఫేమ్ డైరెక్టర్  సెల్వ రాఘవన్ దర్శకత్వం లో ఎన్.జి.కె ' ( నంద గోపాల కృష్ణ )  చిత్రం లో నటిస్తున్నారు సూర్య . ఈ చిత్రం డ్రీమ్ వర్రియర్ , రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకం ఫై ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు చేశారు. మే 28  వ తారీకు జెఆర్సి ఫంక్షన్ హాల్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.

 

కాగా .. సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్అధినేత కె.కె.రాధామోహన్విడుదల చేస్తున్నారు. సూర్య సరసన సాయిపల్లవి, రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  చిత్రానికి శివ కుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిచగా , యువ శంకర్ రాజా సంగీతం వహిస్తున్నారు. అన్ని పనులు శరవేరంగా పూర్తి చేసుకుని మే 31 తారీఖున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Popular News


Current News

Back to Top
img