,

Temp :Hyderabad : 31.6(°С) Tirupathi : 34(°С) Vijaywada : 34(°С) Visakhapatnam : 34(°С) Guntur : 34(°С) Kakinada : 35(°С) Kurnool : 33.5(°С)






img
img

అఖిల్,బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌,బ‌న్నివాసు చిత్రం ప్రారంభం
Posted On - 24:May:2019 04:34:52 PM
.............................................................................. ..................................................................................

Share

కింగ్ నాగార్జున గౌర‌వ ద‌ర్శ‌క‌త్వంలో , అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా బేబి అన్విత క్లాప్ తో అఖిల్ అక్కినేని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, బ‌న్నివాసు ల చిత్రం ప్రారంభం

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 గా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో నిర్మాత‌లు బ‌న్నీవాసు , వాసు వ‌ర్మ లు నిర్మాత‌లుగా  నిర్మాణం చేప‌డుతున్న చిత్రం పూజాకార్య‌క్ర‌మాలు ఈరోజు  ఫిల్మ్‌న‌గ‌ర్ టెంపుల్ లో జరిగాయి.  ఈ కార్య‌క్ర‌మానికి కింగ్ నాగార్జున గారు, శ్రీమ‌తి అమ‌ల గారు, మెగాస్టార్ చిరంజీవి స‌తీమ‌ణి శ్రీమ‌తి సురేఖ గారు, శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌తీమ‌ణి శ్రీమ‌తి నిర్మ‌ల గారు, ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ గారు, శ్రీకాంత్ అడ్డాల గారు, మారుతి గారు హ‌జ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో కింగ్ నాగార్జున గారు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా  స్టైలిస్‌స్టార్ అల్లు అర్జున్ త‌న‌యుడు  అల్లు  ఆయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా శ్రీ అల్లు అర‌వింద్ గారి మ‌న‌మరాలు  బేబి అన్విత క్లాప్ కొట్టారు. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం లో ఈ చిత్రం పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకొగా ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ అల్లు అర‌వింద్ గారు, కింగ్ నాగార్జున ఫ్యామిలీలు రావ‌టం యూనిట్ అంద‌ర్ని ఆక‌ట్టుకుంది.

అఖిల్ అక్కినేని -బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ల కాంబినేష‌న్అ..క్కినేని నాగేశ్వ‌రావు గారి, అక్కినేని నాగార్జున గారి న‌ట వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన అఖిల్ అక్కినేని త‌న‌ సినిమాల ద్వారా త‌న‌కంటూ  ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. త‌ను చేసిన హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్జూ లాంటి ల‌వ్ కమ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్స్ తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలి అండ్ గ‌ర్ల్స్ సెక్టార్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బొమ్మ‌రిల్లు లాంటి చిత్రం ఇప్ప‌టికి ట్రెండ్ సెట్ట‌ర్ ఇన్ ల‌వ్ అండ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా నిలిచిపోయిందంటే అది కేవ‌లం ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ విజ‌న్ అండ్ వాల్యూస్ అని చెప్పాలి. ఆ త‌రువాత వ‌చ్చిన ప‌రుగు చిత్రం ప్ర‌తి ఓక్క‌రిని ఆలోచింప‌చేసేలా అద్బుతంగా తీర్చిదిద్దాడు. ఫ్యామిలి ఆడియ‌న్స్ లో భాస్క‌ర్ ది సెప‌రేటు ఇమేజ్ వుంది. ఇప్ప‌డు వీర‌ద్దిరి కాంబినేష‌న్ లో చిత్రం అన‌గానే ఈ క్రేజ్ మ‌రింత పెరిగింది. 

 

న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు, మ‌రియు షూటింగ్ షెడ్యూల్స్ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం అని నిర్మాత‌లు తెలిపారు..

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌

కెమెరా- వి.మ‌ణికంద‌న్‌

సంగీతం- గోపిసుంద‌ర్‌

ఎడిటింగ్‌- మార్తాండ్‌.కె.వెంక‌టేష్‌

నిర్మాత‌లు.. బ‌న్ని వాసు, వాసు వ‌ర్మ‌

క‌థ‌, స్క్నీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం- భాస్క‌ర్‌

Popular News


Current News

Back to Top
img