,

Temp :Hyderabad :26(°С) Tirupathi :30.3(°С) Vijaywada :33(°С) Visakhapatnam :29.3(°С)
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img

ఈ సినిమాలో నాది ద్విపాత్రాభినయం కాదు:శ్రద్ధా కపూర్!
Posted On - 14:Sep:2017 01:34:29 PM
.............................................................................. ..................................................................................

Share

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా సినిమా షూటింగులో శ్రద్ధా కపూర్ జాయిన్ అయింది. సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తుందంటూ కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఒక పాత్ర కాస్త అమాయకంగా కనిపించేదైతే .. మరొకటి డోంట్ కేర్ అనే టైపులో కొనసాగే పాత్రని చెప్పుకున్నారు.

తాజాగా విషయంపై శ్రద్ధా కపూర్ స్పందించింది. సినిమాలో తాను డ్యూయెల్ రోల్ చేస్తున్నానంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పింది. ప్రభాస్ సరసన తాను చేసేది ఒకటే రోల్ అని స్పష్టం చేసింది. షూటింగులోనే తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పింది. ప్రభాస్ సరసన ఛాన్స్ రావడం ఒక అదృష్టమైతే .. బహుభాషా చిత్రంలో అవకాశం దక్కడం మరో అదృష్టమని అంది. సినిమాలో తన పాత్ర పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది.   

Popular News


Current News

Back to Top
img