,

Temp :Hyderabad :26(°С) Tirupathi :30.3(°С) Vijaywada :33(°С) Visakhapatnam :29.3(°С)
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img

'కోహ్లి మేరీ మీ' అంటూ ప్రపోజ్ చేసిన క్రికెటర్
Posted On - 13:Sep:2017 06:55:02 PM
.............................................................................. ..................................................................................

Share

క్రికెట్  ప్రేమికులు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు తెలియదా అంటూ ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్‌  పై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.డానియెల్లి కూడా ఆ విషయంపై ఘాటుగా స్పందించారు.తనకు విరాట్ పేరు తెలుసు కనుక,గతంలో నేను అతడికి ప్రపోజ్ చేశానని చెప్పారు.కోహ్లీ అందించిన బ్యాట్‌పై ఉన్న పేరు(VIRAT KHOLI) రాసింది తాను కాదని,బ్యాట్ తయారు చేసిన వారిని అడిగితే బాగుంటుందని ఆమె ట్వీట్ చేయగా అది వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లి ఆటపట్ల ఆకర్షితురాలైన ఇంగ్లండ్ క్రికెటరే ఈ డానియెల్లి యాట్.

గతంలో 'కోహ్లి మేరీ మీ' అని తనకి ప్రపోజ్ చేసిన ఆమెకు విరాట్ బహుమతిగా ఓ బ్యాట్ కానుకగా ఇచ్చాడు.2014లో టీమిండియా జట్టు ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు డానియెల్లికి ఇచ్చిన బ్యాట్‌ను ఇంకా వాడలేదని,త్వరలో ఈ బ్యాట్‌తో ప్రాక్టీస్ చేయనున్నట్లు డానియెల్లి ట్వీట్ చేశారు.బ్యాట్ కింద ఉన్న కోహ్లి పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ గమనించిన నెటిజన్లు.. కోహ్లి పేరు కూడా సరిగా తెలియదా అంటూ ఆమెను ప్రశ్నిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు.'ఇప్పుడు కూడా మీరు నాపై కామెంట్ చేస్తారా.. కోహ్లీ బ్యాట్లు తయారుచేసే వ్యక్తి ఈ పని చేశాను. నేను కాదంటూ' మరో ట్వీట్ ద్వారా వెల్లడించారు

Popular News


Current News

Back to Top
img