,

Temp :Hyderabad :26(°С) Tirupathi :30.3(°С) Vijaywada :33(°С) Visakhapatnam :29.3(°С)
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img

పవన్ ఆకాశమైతే కత్తి మహేష్ అణువు: సంపూ
Posted On - 13:Sep:2017 05:55:40 PM
.............................................................................. ..................................................................................

Share

కత్తి మహేష్ బిగ్  బాస్ కార్యక్రమంలో పాల్గొనే వరకు రాష్ట్రంలో సగం మంది ప్రజలకు కూడా తెలియని పేరు.ఆ కార్యక్రమంలో నుండి బయటకి రాగానే ఎదో పెద్ద హీరోలుగా ఫీల్ అయిపోయి ఇష్టం వచ్చినట్లు ఇతరులను కామెంట్లు చేస్తున్నారు.జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మీడియాలో వ్యక్తిగతంగా,రాజకీయపరంగా, సినిమాపరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పెద్ద చర్చనీయాంశంగా తయారయ్యాడు.

తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపూ ఈ విషయం గురించి మాట్లాడుతూ..'మాట్లాడే స్వాతంత్య్రం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే బాగుండదు.ఎవరి గురించి మాట్లాడుతున్నాం,ఎలా మాట్లాడుతున్నాం అని ఆలోచించి మాట్లాడాలి.అభిప్రాయం వెల్లడించడంతో తప్పులేదు కానీ అది ఎవరినీ హర్ట్ చేయకుండా ఉండాలి.పవన్‌కళ్యాణ్‌ లో నటించే టాలెంట్ లేనిదే కోట్లమంది అభిమానులు ఎలా వస్తారు?ఆయన ఆకాశం అయితే..ఈయన అణువు లాంటివాడు. అలాంటిది మహేష్‌కత్తి ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు' అని చెప్పుకొచ్చాడు సంపూ.పవన్‌కళ్యాణ్‌ని కలవడానికి మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నా.. ఆయనను కలిస్తే ఆ కిక్కులోనే ఓ పదేళ్లు గడిపేస్తా.. అని సంపూ తెలిపారు.

Popular News


Current News

Back to Top
img