,

Temp :Hyderabad :26(°С) Tirupathi :30.3(°С) Vijaywada :33(°С) Visakhapatnam :29.3(°С)
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com

img
img

బిగ్‌బాస్‌ విజేత ఎవరు?
Posted On - 13:Sep:2017 04:57:40 PM
.............................................................................. ..................................................................................

Share

బుల్లి తెర ఫై ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో బిగ్ బాస్ ఈ కార్యక్రమం మంచి టీఆర్పీ రేటింగ్ లతో దూసుకెళ్తుంది.ఇంకొన్ని రోజులలో బిగ్ బాస్ సీజన్1 శుభం కార్డు పడబోతోంది.ఇప్పుడు ప్రేక్షకులందరిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే ఎవరు గెలుస్తారు? నవదీపా? హరితేజానా? శివ బాలాజీయా?అర్చనా కొట్టేస్తే?

నవదీప్ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కదా గెలవక పోవొచ్చేమో! హరితేజానా అన్ని రకాలుగా టాలెంట్‌ ఉంది.. కావచ్చు.శివబాలాజీ... కొంచెం కోపం ఎక్కువ కదా....గెలుస్తాడా? అర్చన గెలవటం....కష్టమే ఎవరికీ వారు ఓ అంచనాకి వచ్చేస్తున్నారు.బిగ్‌ బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం  ఆరుగురు సభ్యులు మిగిలారు.1.నవదీప్‌ 2.శివబాలాజీ 3. అర్చన 4.హరితేజా 5.ఆదర్శ్‌ 6.దీక్షా.వీరిలో అర్చన,హరితేజా,ఆదర్శ్,దీక్షా ఈ వారం నామినేట్‌ అయిన వారిలో  ఉన్నారు కావున దాదాపు ఆదర్శ్,దీక్షాను ఈ వారం  పంపించేయవచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు.చివరికి నవదీప్, శివబాలాజీ, అర్చన,హరితేజా మిగులుతారని ఎక్కువమంది భావిస్తున్నారు.

ఎన్నో మలుపులు

బిగ్‌బాస్‌ మొదలైనప్పటి నుంచి ఆ షో ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంది.చివరి వరకూ ఉంటారనుకున్న ధన్‌రాజ్, ప్రిన్స్‌ షో నుంచి ఎలిమినేట్‌ కావాడం వాళ్ల అభిమానులకే కాదు చాలామంది ప్రేక్షకులకు మింగుడు పడటం లేదు. హౌస్‌లో ఎక్కువసార్లు నామినేట్‌ అయిన అర్చన, దీక్షా, శివబాలాజీ వంటి వారు షోలో మిగిలి తక్కువసార్లు నామినేట్‌ అయిన ప్రిన్స్,ధన్‌రాజ్‌ బయటకు వచ్చేయడం ఊహించని మలుపుగా భావించవచ్చు. క్లయిమాక్స్‌లో కూడా ఇలాంటి మలుపే ఎదురుకావచ్చా? అనేది ఇప్పుడు సందేహం.

స్నేహితుల మధ్య చిచ్చు

బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న ఆదర్శ్ ప్రిన్స్‌ల మధ్య స్నేహం ఉంది.షోలో వీరు కలిసి కట్టుగా పాల్గొన్నారు.అయితే గత వారం ప్రిన్స్‌ ఎలిమినేట్‌ అయినప్పుడు ‘మీ స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఆదర్శ్‌ గేమ్‌ ఆడాడా?’ అనే ప్రశ్నకు ప్రిన్స్‌ ‘ఔను’అని సమాధానం చెప్పడం ఆదర్శ్‌నే కాదు ప్రేక్షకులను కూడా షాక్‌కు గురి చేసింది.హతాశుడైన ఆదర్శ్‌ అలా ప్రిన్స్‌ ఎందుకు అన్నాడో తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు.వాస్తవానికి బిగ్‌బాస్‌ షోలో కంపోజ్డ్‌గా జాగ్రత్తగా ఉన్న హౌస్‌మేట్స్‌లో ఆదర్శ్‌ ఒకడు.షోను గెలవదగ్గ స్థాయి పరిణితి కూడా అతడికి ఉంది.కాని ప్రిన్స్‌– తాను ఎలిమినేట్‌ అయ్యాడన్న కోపంలో ఆదర్శ్‌ మనసు గాయపరిచాడా? అని భావించాల్సి వస్తోంది.

పగబట్టిన ముమైత్‌

బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న ముమైత్‌ ఖాన్‌ తొలి నుంచి కత్తి మహేశ్‌తో,ధన్‌రాజ్‌తో స్నేహంగా మెలిగింది. వారిరువురు కూడా ఆమెతో స్నేహం పాటించారు.అయితే మొదటి వారం నుంచి కూడా ముమైత్‌ బిగ్‌బాస్‌లో ‘కెప్టెన్సీ కోసం పాకులాడటం కనిపించింది.కాని టీమ్‌మేట్స్‌ పెద్దగా సహకరించలేదు.ఒక దశలో ధన్‌రాజ్‌ తాను కెప్టెన్‌ కావడానికి అడ్డుపడ్డాడని ముమైత్‌ భావించింది.అంతే అప్పటి వరకూ ఉన్న స్నేహాన్ని పక్కన పెట్టి ధన్‌రాజ్‌ మీద పగబట్టి అతణ్ణి వెంటాడింది. ‘దుర్బాషలాడటం’ఏ స్థాయిలో ఉండిందంటే ధన్‌రాజ్‌ కళ్లనీళ్లు పెట్టుకొని షో నుంచి విరమించుకునే దశకు వెళ్లాడు.బిగ్‌బాస్‌లో ఎవరూ స్నేహితులు కాదు ఎవరూ శత్రువులు కాదు...మనిషి తన స్వార్థం తాను చూసుకుంటాడనేదానికి ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి.విశేషం ఏమిటంటే అండర్‌ డాగ్‌గా ఉన్న శివబాలాజీ ఇవాళ ఫైనల్స్‌కు చేరుకుని ఆశ్చర్యపరచడం.

అర్చన... అట్రాక్షన్‌

హీరోయిన్‌గా ఒకప్పుడు నటించి,ఆ తర్వాత ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న అర్చన బిగ్‌బాస్‌ షోకు గ్లామర్‌ యాడ్‌ చేసిందని చెప్పవచ్చు.యూత్‌ మెచ్చే బట్టలు ధరిస్తూ ఎప్పుడూ లిప్‌స్టిక్‌ చెరగకుండా చూసుకుంటూ బ్యూటీ కాన్షియస్‌నెస్‌తో ఆమె ఈ షోలో స్క్రీన్‌కు అట్రాక్షన్‌ ఇస్తోంది.అయితే ఆమె ప్రవర్తనలో నస పెట్టే స్వభావం అందరు ప్రేక్షకులకు కొంచెం ఇబ్బంది కలిగిస్తోందని చెప్పవచ్చు.చిన్న విషయాన్ని కూడా అర్చన రోజుల తరబడి చర్చ చేయడం గమనించదగ్గ విషయం.మరో హౌస్‌మేట్‌ దీక్షాతో అర్చన చీటికిమాటికి గొడవకు దిగడం కూడా ప్రేక్షకులు గమనించారు.స్విమ్మింగ్‌పూల్‌ స్నానాలు బిగ్‌బాస్‌ హౌస్‌లో కామనే అయినా అర్చనా, ముమైత్‌ వంటి వారు పూల్‌లో దిగి హొయలు పోవడం టిఆర్‌పిలకు ఒక ప్లస్‌ అని చెప్పక తప్పదు.

ఎన్టీఆర్‌కు ఫుల్‌ మార్క్స్‌

బిగ్‌బాస్‌ షో మొదటివారం ఎన్టీఆర్‌ యాంకరింగ్‌ చూసినవారు కొంచెం ఈజ్‌గా చేయడం లేదు అని ఫీలైనా రెండో వారం నుంచి ఎన్టీఆర్‌ చెలరేగి పోయి కోట్లాది మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.ఊరికే మొక్కుబడిగా యాంకరింగ్‌ చేయడం కాకుండా షో ఫాలో అవుతూ అందరి తప్పొప్పులు గమనిస్తూ ఆయన ఈ యాంకరింగ్‌ చేస్తున్నాడని ప్రేక్షకులకు అర్థం కావడం వల్ల కూడా ఆయన యాంకరింగ్‌ నచ్చుతోంది.ఎన్టీఆర్‌ హౌస్‌మేట్స్‌తో పాటు తాను కూడా ఆటలు ఆడుతూ జోకులు వేస్తూ డాన్సులు చేస్తూ ప్రేక్షకులను చాలా ఆహ్లాదపరుస్తున్నారు.బిగ్‌బాస్‌ ఎన్ని సీజన్లు వచ్చినా ఆయనే యాంకర్‌ కావచ్చు.ఆయన వేసిన ముద్ర వల్ల ఆ తర్వాత యాంకర్‌లు మారితే జనానికి సంతృప్తి కలిగించడం చాలా కష్టమే అవుతుంది.ఏమైనా ఈ షో ముగియడానికి వచ్చింది.విజేతలు ఎవరైనా... మానసిక కాలుష్యం కలిగించే చాలా సీరియల్స్‌ కంటే ఈ షో ప్రేక్షకులకు ఆహ్లాదం పంచిందని చెప్పవచ్చు.ఈ షోకు వచ్చిన డిమాండ్‌ చూస్తుంటే సీజన్‌ 2లో ఇంకా పెద్ద సెలబ్రిటీలు పాల్గొంటారని,ఆ సీజన్‌ ఇంకా పెద్ద హిట్‌ కావచ్చని అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.

Popular News


Current News

Back to Top
img