" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
జగన్ ను టార్గెట్ చేస్తున్న టీడీపీ శ్రేణులు

Posted On - 12:Jan:2017 06:23:44 PM
.............................................................................. ..................................................................................

Share

ఏపీ లో టీడీపీ ప్రభుత్వం కొన్ని రోజుల నుండి జగన్ మీద బాగా విమర్శలు చేస్తూనే ఉంది .జగన్ సొంత పార్టీ నుండి నాయకులను తమ వైపు తిప్పుకోవటంలో టీడీపీ శ్రేణులు విజయం సాధిస్తున్నాయనే చెపుకోవచ్చు .తాజా పరిస్థితులు చూస్తుంటే జగన్ ను సొంత నియోజక వర్గంలోనే బలహీన పరచటానికి ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ సొంత నియోజక వర్గమైన పులివెందుల అభివృద్ధిపై దృష్టి పెట్టి నియోజక వర్గ ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలను మొదలుపెట్టింది దానిలో భాగంగానే పులివెందులకు సాగునీటిని అందించి ఎంతోకొంత పేరును సంపాదించుకొంది .

 

ఎవ్వరు ఊహించని విధంగా అధికార పార్టీ పులివెందుల మీద దృష్టి పెట్టటంతో జగన్ రాష్ట్రాన్ని వదిలేసి ముందుగా తన సొంత ప్రజలమీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు తీసుకువచ్చింది టీడీపీ .ఇప్పటివరకు అక్కడ నాయకులను పట్టించుకోని జగన్ ప్రస్తుతం ఉన్న  పరిస్థుతుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవటమే కాకుండా నాయకులతో ఎక్కువ చర్చలు జరుపుతున్నారు .సొంత నియోజకవర్గంలో పార్టీ పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ఆయన వారికి సూచనలు ఇస్తున్నట్టు సమాచారం. మొత్తానికి టీడీపీ కొత్త వ్యూహాలు జగన్ కు ఊపిరాడనివ్వటం లేదనే చెప్పాలి.

Film News


Current News

Back to Top
img