" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Posted On - 12:Jan:2017 03:40:03 PM
.............................................................................. ..................................................................................

Share

ఏమంటు   రిలయన్స్ జియో ని ఉచిత డేటా మరియు ఉచిత  వాయిస్ కాల్స్ సదుపాయాలతో లాంచ్ చేసిందో అప్పటి  నుండి మిగిలిన టెలికాం రంగ సంస్థలకు కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి  .జియో రాక ముందు వరకు మిగిలిన సంస్థలు ఉచిత సేవలను అందించ లేదు జియో తో పోటీని తట్టుకోవటానికి ఇప్పుడిప్పుడే ఒకొక్క  సంస్థ ఉచిత ఆఫర్లను ప్రకటిస్తుంది .ఈ మధ్యనే ఎయిర్‌టెల్ 4 జీ సర్వీసులకు అప్గ్రేడ్ అయ్యే వినియోగ‌దారుల‌కు సంవత్సరం పొడవునా ఉచిత 4జీ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది .

ఇప్పుడు ఐడియా కూడా అదే బాటలో ప్రయాణిస్తుంది .ఎవరైనా కొత్తగా ఐడియా 4జీ హ్యాండ్సెట్లలోకి అప్గ్రేడ్ అయ్యే వినియోగ‌దారుల‌కు అదనంగా 3జీబీ మొబైల్ బ్రాండ్బాండ్  అందచేయునట్లు తెలిపింది .దీనితో ఐడియా వినియోగదారులంతా ఉచిత డేటా ను పొందగలరు .

కొత్త ఐడియా 4జీ డేటా ఆఫర్ కింద రూ.348తో రీచార్జ్  చేసుకొన్నా వినియోగదారులు అదనంగా మరికొన్ని ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది .ఇప్పటికే ఐడియా ప్రీపెయిడ్ 4జీ హ్యాండ్ సెట్లు వున్నా వినియోగదారులు ఉచితంగా 1జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు పొందవచ్చని తెలిపింది .ఐడియా పోస్టు పెయిడ్ వినియోగ‌దారులయితే రూ.499 రెంటల్ ప్లాన్పై సబ్స్క్రైబ్ అవ్వాల్సి ఉంటుందని ఐడియా ప్ర‌తినిధులు తెలిపారు. దీంతో  4జీ హ్యాండ్సెట్ కస్టమర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్, నేషనల్, ఇన్కమింగ్ రోమింగ్ కాల్స్ స‌హా 3జీబీ ఉచిత డేటాను అందిస్తుంది .

4జీ హ్యాండ్సెట్  లేని వినియోగదారుల కోసం అన్‌లిమిటెడ్‌ కాలింగ్ ఆఫ‌ర్‌తో పాటు 1జీబీ ఉచిత డేటా ను అందిస్తుంది ఐడియా  పోస్ట్‌పెయిడ్‌ వినియోగ‌దారు రూ.999 రెంటల్ ప్లాన్ను యాక్టివేట్ చేసుకుంటే రూ.499 ప్లాన్పై ఉన్న అన్నీ ప్రయోజనాలనూ పొందవచ్చని పేర్కొన్నారు. దానితో పాటు రోమింగ్పై ఉచిత కాల్స్, 4జీ హ్యాండ్సెట్ కస్టమర్లకు 8జీబీ మొబైల్ బ్రాండ్బాండ్ పొంద‌వ‌చ్చ‌ని, ఇతర కస్టమర్లు 5జీబీ డేటా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఐడియా వినియోగదారులకు సంవత్సరం పాటుగా అన్ని ప్లాన్స్ మీద అదనంగా 3జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చని తెలిపారు .

Film News


Current News

Back to Top
img