" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
హేమామాలిని ఆ విధంగా నాకు షాక్ ఇచ్చారు : క్రిష్

Posted On - 12:Jan:2017 03:03:45 PM
.............................................................................. ..................................................................................

Share

నిన్నటి వరకు మెగాస్టార్ మేనియా నడిచింది....ఈరోజు నుండి ఇక టాలీవుడ్ లో అంతా బాలయ్య హడావిడి నడుస్తోంది. ముందుకి వచ్చిన "గౌతమీపుత్ర శాతకర్ణి" ఉర్రూతలూగిస్తోంది. అసలీ టైటిల్ చూస్తేనే , సినిమాలో శాతకర్ణి తల్లి పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉంది అని అర్ధమవుతోంది కదా?మరి అంత ముఖ్యమైన పాత్రకి ఎవరిని తీసుకోవాలి....బాలకృష్ణ తో ధీటుగా నటించే తల్లి పాత్రని ఎవరిలో చూసుకోవాలి అన్న విషయం మీద దర్శకుడు క్రిష్ పెద్ద ఎత్తున చర్చలు జరిపాడు. ఎందరో సీనియర్ నటీమణుల పేర్లని పరిశీలించినా, క్రిష్ అనుకున్నట్టు గౌతమి పాత్రని ఎవరిలోనూ ఊహించుకోలేకపోయాడు. చివరిగా క్రిష్ మదిలో శాతకర్ణి తల్లి పాత్రకి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని అయితే బాగుంటుంది అని అనుకున్నాడట. హేమామాలిని ఎలా ఒప్పుకుంది...అసలు ఆవిడని క్రిష్ ఎలా సంప్రదించాడు తదితర వివరాలని మీడియాతో పంచుకున్నాడు క్రిష్.

‘‘నిజానికి నేను గౌతమీపుత్ర శాతకర్ణి కథను బాలయ్యకు చెప్పే సమయానికి తల్లి పాత్ర ఎవరన్నది నాకే క్లారిటీ లేదు. కాకపోతే హీరోయిన్ పాత్రకు శ్రియను అనుకున్నాను కానీ.. తల్లి పాత్ర గురించే ఏమీ అనుకోలేదు. కొంతమంది సీనియర్ నటీమణుల పేర్లని పరిశీలించా కానీ, సంతృప్తికరంగా అనిపించక చాలా రోజుల తర్వాత పాత్రకు హేమమాలినిని అనుకుంటున్నట్లు బాలయ్యకు చెప్పాను. ఆయన వెంటనే సరే అన్నారు. హిందీలోగబ్బర్సినిమా చేసిన పరిచయంతో అక్షయ్ కుమార్ ద్వారా హేమమాలినిని కలిసే అవకాశం సంపాదించాను. ఆవిడని కలిసి కథ చెప్పాక ఆమె తన నిర్ణయం తర్వాత చెబుతానన్నారు. మరుసటి రోజు ఫోన్ చేస్తే.. తన నిర్ణయమేంటో చెప్పకుండా గౌతమి బాలశ్రీ గురించి.. శాతకర్ణి గురించి చెప్పడం మొదలుపెట్టారు. నాకు తెలియని విషయాలు కూడా ఆమె చెప్పారు. నేను షాకయ్యాను. గ్యాప్ లో గౌతమి గురించి.. శాతకర్ణి గురించి హేమమాలిని అంతగా పరిశోధన చేశారు. తన పాత్ర విషయంలో ఆమెకున్న డెడికేషన్ అది’’ అని క్రిష్ వివరించాడు. హేమమాలిని గారి దగ్గరనుంచి ఈతరం నటీనటులు నేర్చుకోవాల్సింది ఏంటో ఉంది అని క్రిష్ డ్రీమ్ గర్ల్ ని ఆకాశానికి ఎత్తేసాడు.

 

 

Film News


Current News

Back to Top
img