" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
చివరి ప్రసంగంలో కన్నీళ్లు పెట్టుకున్న ఒబామా

Posted On - 12:Jan:2017 10:44:59 AM
.............................................................................. ..................................................................................

Share

అధ్యక్షుడి హోదాలో చికాగోలో గత రాత్రి చివరి ప్రసంగం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ఒబామా, ఉద్వేగంతో కంటతడిపెట్టారు. ఒబామా స్పీచ్ అయ్యాక ఆయన అభిమానులు ఒన్స్ మోర్ అని నినాదాలు చేయడంతో ఒబామా ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. భారత కాలమాన ప్రకారం ఈరోజు తెల్లవారు ఝామున ఒబామా అధ్యక్షా పదవికి వీడుకోలు పలికారు. సందర్భంగా ఒబామా దుక్ఖాన్ని ఆపుకుంటూ ఏంటో ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. చివర్లోమేము చేయగలం.. మేము చేశాముఅని నినదించారు. తన సొంత పట్టణమైన చికాగోలో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికన్లు.. విలువల పతనం, జాతివివక్ష తదితర విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశ యువత, కృషి, వైవిధ్యం, పారదర్శకత, తెగింపు, పునఃసృష్టిస్తే భవిష్యత్తు మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

అలాగే, జాతి వివక్షపై మరింత బలమైన చట్టాలు ఉండాలన్నారు. దీనిలో మన రాజ్యాంగం.. ఆదర్శాలు ప్రతిబింబించాలని ఆకాంక్షించారు. తనకు అమెరికాపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. అమెరికన్లకు పునఃసృష్టి చేసే అచంచలమైన శక్తి ఉందన్నారు. భవిష్యత్తు అమెరికాదే అని స్పష్టం చేశారు. అమెరికా ప్రజాస్వామ్యం పనిచేస్తే శక్తి భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. మన రాజకీయాలు దేశ ప్రజలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. పార్టీలకు, ఆసక్తులకు అతీతంగా సమష్టి ప్రయోజనం కోసం పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మనం భయాన్ని పెంచితే ప్రజాస్వామ్యం బలహీనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మనల్ని ఈస్థాయికి తీసుకొచ్చిన విలువలకు పరిరక్షణగా ఉందాం.. అందుకే నేను ముస్లిం అమెరికన్లపై వివక్షను మాత్రం అంగీకరించను అని పేర్కొన్నారు.అదే సమయంలో అక్కడ ఉన్న వారంతాచివరిగా ఇంకొక్కసారిఅని కోరడంతో ఒబామా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఒబామాతోపాటే కార్యక్రమానికి వచ్చిన వందలాది ప్రజలు, అధికారులు చాలామంది కంట తడి పెట్టడం, తమ ప్రియతమ అధ్యక్షుడుతో కరచాలనం చేయాలని, వీలయితే ఒక ఫోటో దిగాలని పలువురు ఆసక్తి చూపడం కనిపించింది.

 

 

 

Film News


Current News

Back to Top
img