" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!
img
img
సిబిఐ కి కొత్త నిర్వచనాన్నిచ్చిన దీదీ
Posted On - 12:Jan:2017 10:42:23 AM
.............................................................................. ..................................................................................

Share


దేశమంతటిది ఒక దారైతే, నాడో దారి అన్నట్టు వ్యవహరించడం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నైజం. ఇటీవలే ఆమె ప్రధాని నరేంద్ర మోడీ ని జైల్లో వేయాలి అని చేసిన కామెంట్స్ కి, మోడీ ఒక సభలో మాట్లాడుతూ " వయసులో నీకెందుకు అంత శ్రమ దీదీ , జైలుకి పోవాలో చెప్తే నా అంతట నేనే వెళ్ళిపోతా " అని తనదైన శైలిలో వెటకారంగా రిటార్ట్ ఇచ్చారు. తరువాత మమతా నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ ఇప్పుడావిడ ఫోకస్ అంతా కేదన్రా దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ మీదకి మళ్లింది. పశ్చిమబెంగాల్ లో బర్ద్వాన్ లో ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రోజ్ వాలీ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్.పి లను సిబిఐ అరెస్టు చేయడాన్ని ఆమె తప్పు పడుతున్నారు. సిబిఐ నేడు కుట్రల బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా తయారయింది అని ఆమె విరుచుకుపడ్డారు.. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు లు జరిగాయని ఆమె అన్నారు. సిబిఐ కొందరు కుట్రను ప్రోత్సహించేవారికి అనుగుణంగా కుట్రలు చేసే సంస్థగా మారిందని మమత అన్నారు.కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ బాక్ ఆఫీస్ గా వ్యవహరిస్తూ రాజకీయ కక్షలకు సాధనంగా ఉపయోగపడుతోందని ఆమె అన్నారు.

ప్రపంచంలోనే అత్యుత్తమైన నిఘా వ్యవస్థ, దార్యాప్తు సంస్థలలో ఒకటిగా పేరు పొందిన సిబిఐ ని పట్టుకుని అంత పెద్ద మాట అన్నాక, సిబిఐ నుండి లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి మరి.

 

 

 

Popular News


Current News

Back to Top
img