" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!   ♣ టైమ్ వస్తే పోర్న్ సినిమాలు కూడా చేసేస్తుందట ..!
img
img
నెటిజన్ల దెబ్బకి ఫోటో డిలీట్ చేసిన సుందరి
Posted On - 11:Jan:2017 09:01:19 PM
.............................................................................. ..................................................................................

Share

సినీ హీరోలు - హీరోయిన్లు ఎలాంటి భోగాలు అనుభవిస్తారో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు అయితే ...అబ్బో...వారికి జరిగే రాచ మర్యాదలు ఆలా ఇలా ఉండవు. ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే దాకా , ఏది కావలి అంటే అది చిటికెలో తమ కాళ్ళ దగ్గరికి వచ్చే ఏర్పాట్లు చేసి ఉంచుతారు దర్శక నిర్మాతలు. ఇక విషయానికి వస్తే, చేసిన కొన్ని సినిమాలతోనే బాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో ఒకరిగా మారిపోయిన పరిణీతి చోప్రా.. ఇప్పుడు తెగ బిజీ అయిపోయింది. అటు సినిమాలు.. ఇటు ఫోటోషూట్స్ తోపాటు.. వెకేషన్స్ ను కూడా ఎంజాయ్ చేస్తోంది. తన హాలిడేయింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇదే క్రమంలో పరిణీతి తాజాగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి (పైన కనిపిస్తున్న ఫోటోనే ) వివాదాస్పదమైంది. ఫోటో పై పరిణీతి నెటిజెన్స్ నుండి తీవ్ర విమర్శలని ఎదుర్కొంది. పైన ఫోటోలో చూస్తున్నట్టు, బీచ్ ఒడ్డున పరిణీతి నడుచుకుంటూ వస్తుంటే.. ఆమె అసిస్టెంట్ గొడుగు పట్టుకుని పక్కనే నడుస్తూ ఉంటాడు. అసిస్టెంట్ ను పెట్టుకునేదే హెల్ప్ కి కాబట్టి ఇందులో అభ్యంతరాలు ఏమీ ఉండవు. కానీ అతగాడు మూడు బ్యాగ్ లను మోస్తూ ఉంటాడు. వాటిలో పరిణీతి చోప్రా హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంటుంది. కనీసం హ్యాండ్ బ్యాగ్ ని కూడా మోయకుండా.. గొడుగు పట్టించుకున్న బ్యూటీపై విమర్శలు వెల్లువెత్తాయి. 'ఎంత స్టార్ అయితే మాత్రం గొడుగు కూడా మోయకూడదా..' 'గొడుగు వంద కిలోల బరువు ఉంటుందేమో' అంటూ నెటిజన్లు సెటైర్స్ పేల్చడం మొదలు పెట్టారు.

ఇదెక్కడ గోడవారగా బాబూ అనుకున్న బ్యూటీ , ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లోంచి తీసేసింది. ప్రస్తుతం మేరీ ప్యారీ బిందు మూవీలో నటిస్తోంది పరిణీతి చోప్రా. మరీ అతి కాకపోతే, ఆల్రెడీ అంత బరువు మోస్తున్న అతడిని చూసి కూడా కనీసం గొడుగు కూడా సొంతంగా పట్టుకోలేవా పాప.... ?

 

 

Popular News


Current News

Back to Top
img