" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!
img
img
ఎవరినైనా సరే వాడుకోవడంలో రాజమౌళి టాప్
Posted On - 11:Jan:2017 06:40:12 PM
.............................................................................. ..................................................................................

Share

వాడుకోవడం అన్నాం కదా అని వేరేదో ఆలోచించుకునేరు. తన పని సులువుగా అయిపోవడం కోసం , పరిస్థితులని- మనుషులని స్మార్ట్ ఉపయోగించుకోవడంలో రాజమౌళి బెస్ట్ అని మా ఉద్దేశం. ఇంతకీ , స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఎవరిని వాడుకున్నాడు అని మీ డౌట్ కదా? వస్తున్నాం....వస్తున్నాం...అక్కడికే వస్తున్నాం. టాలీవుడ్ లోని దర్శకులందరిలో మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నది రాజమౌళికి అనడంలో ఎంతమాత్రం సందేహం అక్కర్లేదు. రాంగోపాల్ వర్మ తరువాత , తన సినిమాలకి అంత క్రేజ్ తెచ్చుకోగలిగింది రాజమౌలి మాత్రమే. అందుకే తన సత్తా అంతా వాడేసి బాహుబలి సినిమాకు రేంజ్ హైప్ తెప్పించడంలో దిగ్విజయం సాధించేశాడు. ప్రమోషన్ పరంగా ఒక అవకాశాన్నీ రాజమౌళి వదులుకోరు ఆనందానికి ఇదొక తాజా ఉదాహరణ అని చెప్పొచ్చు.

గత కొన్నాళ్లుగా రాజమౌళి "బాహుబలి" సినిమా తాలూకు పోస్టర్లు.. కామిక్ బుక్స్.. అంటూ హడావిడి చేసాడు. ఇప్పుడు ఇక కొత్తగా వర్చువల్ రియాల్టీ అనుభవం అంటూ బాహుబలి 2 కోసం చాలా గాట్టిగానే ప్రచారం చేస్తున్నాడు. మొన్నామధ్యన బెంగుళూరులో స్వార్డ్ ఆఫ్ బాహుబలి అంటూ ఒక ఈవెంట్ పెట్టి అక్కడ బాహుబలి వర్చువల్ రియాల్టీ టీజర్ ను చాలామంది చూపించారు. దాంతో, తెలుగు ప్రేక్షకుల కోసం ఎప్పుడు చూపిస్తారు అంటూ రాజమౌళి మీద అభిమానులు ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో, ఈరోజు నుండి హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో బాహుబలి వి.ఆర్. టీజర్ చూసే వీలు కల్పించారు. అక్కడే స్వార్డ్ ఆఫ్ బాహుబటి స్టాల్ ను ఏర్పాటు చేశారు.

సాధారణంగా ఇలాంటి ప్రమోషన్ కార్యకలాపాలు ఫెస్టివల్ సీజన్ లోనో , హాలిడేస్ టైం లోనో చేస్తారు. కానీ, రాజమౌళి తెలివిగా ఈరోజు "ఖైదీ నెం 150"విడుదల అవుతున్న నేపథ్యంలో, మునుపెప్పుడూ లేని విధంగా ప్రసాద్ ఐమ్యాక్స్ వారు 33 షోలను ఒకే సినిమాకు కేటాయించి హౌస్ ఫుల్స్ బోర్డును పెట్టేసిన వేళ.. స్టాల్ ఏర్పాటు చేయడంతో.. అక్కడ సందర్శకుల తాకిడి విపరీతంగా ఉంది. ఇప్పుడు చెప్పండి.....రాజమౌళిని మార్కెటింగ్ విషయంలో ఎవరు బీట్ చేయగలరు?

 

 

 

Popular News


Current News

Back to Top
img