" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
నేను డైలాగ్ చెప్తే అతను బెదిరిపోయాడు : బాలకృష్ణ

Posted On - 11:Jan:2017 06:39:20 PM
.............................................................................. ..................................................................................

Share

హిందూపూర్ ఎమ్మెల్యే, నందమూరి నట సిమహం నందమూరి బాలకృష్ణ వందో సినిమాగౌతమీపుత్ర శాతకర్ణిలో హేమమాలిని లాంటి హేమాహేమీలు ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఏంటో గ్రాండ్ గా, బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించబడ్డ సినిమాలో మరో ప్రపంచ స్థాయి యాక్టర్ ఒకాయన ఉన్నాడు. హాలీవుడ్ సినిమాల్లో సైతం మెరిసి తన ప్రతిభని చాటుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ. ఒకప్పటి బాలీవుడ్ కళల రాణి పూజా బేడీ తండ్రే కబీర్ బేడీ. "గౌతమీపుత్ర శాతకర్ణి లో కబీర్ బేడీ ఒక కీలకపాత్ర చేసాడు. సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని అంటున్నారు. ఆయనతో కలిసి పని చేసిన అనుభవం గురించి బాలయ్య మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.

‘‘కబీర్ బేడి గొప్ప నటుడు. ఆయన మా సినిమాలో డిమిత్రియ్స్ పాత్ర పోషించారు. మొదటి రోజు షూటింగ్ లో నాకు.. ఆయనకు మధ్య కీలక సన్నివేశం తీశారు. ఆయన నాతోమీది బడుగు జాతిరాఅనే డైలాగ్ చెప్పారు. డైలాగ్ ఆయన క్యాజువల్ గా చెప్పారు. కానీ నేనుమాది బడుగు జాతి కాదురా తెలుగు జాతి. అథములం కాదురా.. ప్రథములంఅంటూ డైలాగ్ చెప్పాను. నేను రౌద్రంగా డైలాగ్ చెప్పిన విధానం.. నా హావభావాలు చూసి ఆయన ఆశ్చర్యపోయారు. నా డైలాగ్ అవ్వగానే ఆయన ఆలోచనలో పడ్డారు. తానూ అలా క్యారెక్టర్ లో లీనమవ్వలేకపోయినందుకు దర్శకుడు క్రిష్ కి అయన సారీ చెప్పి.. తాను పాత్రలోకి వెళ్లడానికి టైమ్ కావాలని చెప్పి హోటల్ కు వెళ్లిపోయారు.

ఆరోజు రాత్రంతా కబీర్ బేడీ కి అసలు నిద్రే పట్టలేదట . తన పాత్ర తాలూకు డైలాగులు.. హావభావాలు మరింతగా ప్రాక్టీస్ చేసి.. తర్వాతి రోజు షూటింగుకి వచ్చి అద్భుతంగా చేశారు. ఎంత పెద్ద నటుడికైనా అలాంటి తపన ఉండాలి’’ అని బాలయ్య చెప్పాడు. అదీ నిజమే మరి...బాలయ్య లాంటి నటుడితో పని చేసేటప్పుడు ఆమాత్రం హోమ్ వర్క్ చేసుకుని రావాల్సింది .

 

 

 

Film News


Current News

Back to Top
img