" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
మరో టాప్ హీరోతో క్రిష్ తరువాతి సినిమా?

Posted On - 11:Jan:2017 06:37:37 PM
.............................................................................. ..................................................................................

Share

తెలుగు చలన చిత్ర సీమలో విలక్షణ దర్శకుడిగా పేరుపొందిన క్రిష్ , మొదటి నుండి ఎలాంటి సినిమాలు చేస్తూ వస్తున్నాడా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన నందమూరి నటసింహం బాలకృష్ణ తో " గౌతమీపుత్ర శాతకర్ణి " అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకి రానున్న నేపథ్యంలో, క్రిష్ గురించి అపుడే ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. మామూలుగా కృష్ణ తన ప్రతి సినిమా తరువాత మరో సినిమా మొదలుపెట్టడానికి మధ్యలో చాలా విరామం తీసుకుంటాడు. పర్ఫెక్టుగా స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాకే సెట్స్ మీదకి వెళ్లడం క్రిష్ కి అలవాటు. గ్యాప్ లో స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ముంబై వెళ్లి యాడ్స్ అవీ తీసేసి వస్తుంటాడు.

అలాంటి క్రిష్ కి ఇప్పుడు ఆఫర్ల వెల్లువ మొదలైంది. "గౌతమీపుత్ర శాతకర్ణి" పుణ్యమాని క్రిష్ ఇపుడు తెగ బిజీ అయిపోయాడు. పెద్ద పెద్ద హీరోలందరూ ప్రస్తుతం క్రిష్ వెనకాల పడుతున్నారు. తాజా సమాహారం ప్రకారం, తన తరువాతి సినిమాని ఎవరితో చేయాలి అని డైలామాలో ఉన్న విక్టరీ వెంకటేష్ క్రిష్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గురు చిత్రాన్ని కంప్లీట్ చేసిన వెంకీ.. మరోవైపు కొత్త కథల కోసం ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాడు. కిషోర్ తిరుమలతో ఖాయమే అనుకున్న 'అడాళ్లూ మీకు జోహార్లు' అటకెక్కేసిందనే వార్తలు ఇప్పటికే ఉన్నాయి. మరోవైపు పూరీతో వెంకీ మంతనాలు ఇంకా కొలిక్కి రాలేదట. జనగణమన చిత్రాన్ని మహేష్ కోసం అనుకుని.. ఇప్పుడు వెంకటేష్ కోసం కొన్ని మార్పులు చేసి తీసి యోచనలో ఉన్నాడన్న ఒక టాక్ కూడా ఉంది మరి.

ఉహాగానాలు ఎలా ఉన్నా, క్రిష్ తో సినిమా చేసేందుకు మాత్రం వెంకీ సిద్ధపడినట్టు తెలుస్తోంది. పూరీ తో సినిమా అంటే బడ్జెట్ పేలిపోతుంద, అదే క్రిష్ తో అంటే తక్కువ బడ్జెట్ లో తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసేసి మంచి అవుట్ ఫుట్ ఇస్తాడు అన్నది వెంకీ ఆలోచనగా చెబుతున్నారు. క్రిష్ ట్రాక్ రికార్డ్ ప్రకారం రిస్క్ కూడా తక్కువే ఉంటుంది. అందుకే, రేపు గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలయ్యాక రిజల్ట్ చూసి వెంకీ తుది నిర్ణయం తీసుకోవచ్చూ అని వినికిడి.

 

 

 

Film News


Current News

Back to Top
img