" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
కనుపాప ఆడియో 25న, మూవీ ఫిబ్రవరి 3న విడుదల..!

Posted On - 11:Jan:2017 06:21:26 PM
.............................................................................. ..................................................................................

Share

యాళ అగ్రహీరో మోహన్ లాల్ - ప్రియర్శన్ కాంబినేషన్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఒప్పం. చిత్రం యాళంలో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. యాళంలో ఒప్పం చిత్రం 50 కోట్లుకు పైగా వసూలు చేసి రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. యాళంలో సంచనం సృష్టించిన ఒప్పం చిత్రాన్ని న్నలో శివరాజ్ కుమార్, హిందీలో అజయ్ దేవన్ రీమేక్ చేస్తున్నారు. ఇక తెలుగులో చిత్రాన్ని దిలీప్ కుమార్ బొలుగోటి ర్పలో మోహన్ లాల్ నిర్మాతగా నుపాప అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండడం విశేషం.

ఒప్పం క‌థ విష‌యానికి వ‌స్తే....ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ అంధుడిగా న‌టించారు. అంధుడైన‌ మోహ‌న్ లాల్ ఓ అపార్టెమెంట్ లో లిఫ్ట్ ఆప‌రేట‌ర్ గా వ‌ర్క్ చేస్తుంటాడు. ఒక రోజు ఆ అపార్ట్ మెంట్ లో మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంది. ఆ మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ త‌ప్పించుకుంటాడు. అయితే....మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ ను అంధుడైన‌ మోహ‌న్ లాల్ ఎలా ప‌ట్టుకున్నాడు అనేది ఒప్పం క‌థ‌. 

సంచ‌ల‌నం సృష్టించిన‌ ఒప్పం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా మంది ఇంట్ర‌స్ట్ చూపించారు కానీ...రీమేక్ రైట్స్ ఎవ‌రికీ ఇవ్వ‌కుండా తెలుగులో క‌నుపాప అనే టైటిల్ తో అనువ‌దిస్తున్నారు. మ‌న‌మంతా, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాల విజ‌యాల‌తో మోహ‌న్ లాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. దీంతో క‌నుపాప‌ మూవీ పై టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. మ‌న‌మంతా, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాల‌తో వ‌రుసగా స‌క్సెస్ సాధించిన మోహ‌న్ లాల్ క‌నుపాప చిత్రంతో తెలుగులో హ్యాట్రిక్ సాధిస్తార‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఆశీర్వాద్ సినిమాస్, వ‌న్ ఓవ‌ర్ సీస్ నెట్ వ‌ర్క్ ఎంట‌ర్ టైన్మెంట్ సంయుక్తంగా అందిస్తున్న‌ క‌నుపాప చిత్రం ఆడియోను ఈనెల 25న‌ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ హీరో నుపాప ఆడియోను రిలీజ్ చేయనున్నారు. ఇక చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 3న విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా క‌నుపాప మూవీ గురించి మోహ‌న్ లాల్ మాట్లాడుతూ.... ఈ చిత్రానికి తెలుగులో టైటిల్ క‌నుపాప‌. ఈ చిత్రంలో నేను అంధుడిగా న‌టించాను.  ఫిబ్ర‌వ‌రి 3న క‌నుపాప‌ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నాం. మ‌ల‌యాళంలో ఒప్పం చిత్రాన్ని ఆద‌రించిన‌ట్టే తెలుగులో క‌నుపాప‌ చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు. 

చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిలీప్ కుమార్ బొలుగోటి మాట్లాడుతూ...ఒప్పం చిత్రాన్ని మోహ‌న్ లాల్ గారితో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించే అవ‌కాశం నాకు రావ‌డం ఆనందంగా ఉంది. మోహ‌న్ లాల్ నిర్మాత‌గా అందిస్తున్న ఈ చిత్రానికి నేను  స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరిస్తుండ‌డం చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాను. ఈనెల 25న‌ ఆడియో రిలీజ్ చేసి ఫిబ్ర‌వ‌రి 3న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మ‌ల‌యాళంలో కంటే పెద్ద విజ‌యాన్ని తెలుగులో సాధిస్తుంద‌నే నమ్మ‌కం ఉంది అన్నారు. 

Film News


Current News

Back to Top
img