" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
మెగాస్టార్ కాల్ చేసి 150 చేద్దాం అన్నారు : దేవి

Posted On - 11:Jan:2017 05:34:42 PM
.............................................................................. ..................................................................................

Share

సటాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యువ హీరోలు, యువ సాంకేతిక నిపుణుల్లో చాలామంది చిన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానులు అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. విషయం ఎందరో యువ హీరోలు కానీ, టెక్నీషియన్స్ కానీ వివిధ్డా సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో చెప్పడం మనం ఇప్పటికే చాలా సార్లు చూసాం. అలంటి వారిలో యువ సంగీత సంచలనం, దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒకరు. దేవి తండ్రి సత్యమూర్తి టాలీవుడ్ లో పేరు మోసిన రచయిత. చిరంజీవి హీరోగా చేసిన ఎన్నో సినిమాలకి అయన పనిచేసారు. దాంతో చిరుని తన చిన్నప్పటి నుండి షూటింగ్ లొకేషన్స్ లో చూస్తూ పెరిగాడు దేవిశ్రీ ప్రసాద్. అలాంటి దేవి ఒకరోజు మెగాస్టార్ సినిమాకే మ్యూజిక్ ఇచ్ఛే స్థాయికి ఎదుగుతాడని కనీసం దేవి కూడా అనుకోని ఉండడు .

సత్యమూర్తి గారి మీద ఉన్న అభిమానంతో , చిరు కూడా మొట్ట మొదటి సారి దేవి కి తన "శంకర్ దాదా ఎంబీబీఎస్ " సినిమాకి సంగీతం అందించే అవకాశం ఇవ్వడం, అద్భుతమైన అవకాశానికి పరవశించిపోయిన దేవి, అద్దిరిపోయే సంగీతం ఇవ్వడం మనకి తెలిసిందే. తరువాత "శంకర్ దాదా జిందాబాద్ " కి కూడా అదే నమ్మకంతో చిరు ఛాన్స్ ఇవ్వడం, దాన్ని అంతే స్థాయిలో దేవి నిలబెట్టుకొని మరోసారి అద్భుతమైన పాటలని ఇవ్వడంతో మెగాభిమానులకి చిరు - దేవి కాంబినేషన్ అంటే సూపర్ హిట్ అని గట్టిగ స్టాంప్ పడిపోయింది . దాన్ని నిజం చేస్తూ తాజాగా దేవి , మెగాస్టార్ కం బ్యాక్ మూవీ "ఖైదీ నంబర్ 150" కి కూడా ముందు రెండు సినిమాలకంటే సూర్ హిట్ ఆల్బమ్ ఇఛ్చి సినిమా మీద ఫ్యాన్స్ కి ఉన్న హైప్ ని అమాంతం పెంచేసాడు. ఇంట పెద్ద ప్రాజెక్ట్ కి పనిచేయడం పట్ల తన అనుభవాలని, అనుభూతులని దేవి తాజాగా మీడియాతో పంచుకున్నాడు.

'నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్. ఆయన డ్యాన్సులు సినిమాలూ చూస్తూ పెరిగా. ఆయన ఓసారి కాల్ చేసి 150 మూవీ చేద్దాం అన్నారు. అప్పుడే అది నా బాధ్యతగా స్వీకరించాను. ఆయనకు 150 సినిమా కానీ.. మూవీ పని చేసిన ప్రతీ ఒక్కరు అదే తమ మొదటి సినిమా అన్నంత హుషారుగా పని చేశాం. ఎందుకంటే అక్కడ అందరం మెగా ఫ్యాన్సే. అంతమంది మెగా ఫ్యాన్స్ ఒకచోట చేరి వర్క్ చేస్తే మజా వర్ణించడానికి మాటలు చాలదు' అన్న డీఎస్పీ.. మరో చిత్రమైన అనుభవాన్ని కూడా మీడియాతో పంచుకున్నాడు.

 

' సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ నన్ను పిలిచి మరీ.. "నువ్వు బిజీగా ఉన్నావని తెలుసు.. అయినా సరే నా 150 చిత్రానికి మ్యూజిక్ ఇవ్వాల్సిందే" అనడం ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అప్పటికే నేను "ఖైదీ నంబర్ 150 " కి కమిట్ అయి ఉన్నాను. అయినా సరే, చిరంజీవి గారు మరోసారి సభాముఖంగా నా పేరుని కన్ఫర్మ్ చేస్తూ ఆలా మాట్లాడే సారికి ఒకేసారి అనాదముతో పాటు బాధ్యతతో కూడిన భయం కూడా వేసింది. సినిమాకోసం నేను ఇచ్చిన సంగీతంలో ప్రతీ లైన్ ను మెగాస్టార్ కి సరిపోయేలా.. ఆయన్ని ఊహించుకుంటూ చేసినదే' అని చెప్పాడు దేవిశ్రీ ప్రసాద్. ఏదేమైనా, చిరు -దేవి లది హిట్టు పెయిర్ అని మరోసారి రుజువైంది.

Film News


Current News

Back to Top
img