" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ 'జుద్వా' పేరుతో సల్మాన్ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు. ..!   ♣ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ఇచ్చిన మరో ట్విస్టు ..!   ♣ వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఎయిర్టెల్-టెలినార్ ను కొనుగోలు .. ..!   ♣ ఐదు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం ..!   ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!
img
img
పవన్ కళ్యాణ్ ఇంట్లో పాములు పట్టిన హీరో?
Posted On - 11:Jan:2017 05:29:02 PM
.............................................................................. ..................................................................................

Share

తరుణ్- రిచా శర్మ జంటగా నటించిన చిత్రం "నువ్వేకావాలి" చిత్రంతో తెలుగు తెరకి పరిచయం అయిన నటుడు, ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ రామకృష్ణ తనయుడు సాయికిరణ్ గుర్తుంన్నాడు కదూ? ఒక్క సినిమాతో తెలుగులో ఎంతోమంది అమ్మాయిల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు హీరో. అయితే, తరువాత "నువ్వేకావాలి" ద్వారా వచ్చిన ఫెమ్ ని నిలబెట్టుకోలేకపోయాడు. అప్పుడప్పుడు ఏవో " ప్రేమించు" లాంటి సినిమాలని చేసినా, మనోడికి రావలసినంత గుర్తింపు రాలేదు అనే చెప్పాలి. నటన విషయం పక్కనపెడితే, సాయి కిరణ్ కి మరో టాలెంట్ కూడా ఉందండోయ్. అదేదో తన తండ్రిలాగా పాటలు పాడటంతో, కవితలు రాయడమో, ఇంకేదో అనుకుంటే పొరపడినట్టే. సాయికిరణ్ కి మరో ఇష్టమైన వ్యాపకం పాములు పట్టడమట.

అవునునండి...మీరు చదివింది అక్షరాలా నిజం. సాయి కిరణ్ కి చిన్నప్పటి నుండి పాములతో ఆదుకోవడం మహా సరదా అట. వాటిని పట్టుకోవడంలో మనోడు ఎక్స్పర్ట్ అట. శివుడు అంటే ఉన్న అమితమైన భక్తి వాళ్ళ, తనకి పాములంటే అస్సలు భయం లేదని చెబుతున్నాడు సాయి కిరణ్. వాటిని చూసి భయపడకపోగా, పాములపై మరింత ప్రేమ పెంచుకున్నాడట . తాజాగా ఒక దిన పత్రికకి ఇఛ్చిన ఇంటర్వ్యూలో , పాములతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు . 

చిన్నప్పుడు స్కూల్లో.. చెట్లకు వానపాములు ఎంతో మేలుచేస్తాయని సైన్స్ టీచర్ చెప్పడంతో చెట్ల మొదళ్లలో వాటిని వేయాడంతో మనోడి సావాసం మొదలైందట. ఇలా మొక్కల మొదళ్లలో వానపాములు వేసే క్రమంలో సడన్ ఒక వానపాము అనుకుని చిన్న త్రాచు పామును పట్టుకున్నాడట. దాంతో అది ఇతని వేలుకు చుట్టుకుని బుసలు కొడుతుందట. అయితే , పక్కన ఉన్న వాళ్ళు అది చూసి కంగారు పడిపోయి సాయి చేతిలోంచి పాముని కింద పడేసి కొట్టి చంపేసారట .

అది విషపూరితమైన త్రాచు పాము అని, అది కరిస్తే చచ్చిపోతావని చెప్పేవరకూ అది పామనే విషయం తనకు తెలియదని చెబుతున్నాడు సాయికిరణ్. అనంతరం ఇంట్లో వాళ్లు పామును చంపడంతో మనోడి మనసు కకావికలం అయిపోయిందట.

 

ఇలాగే మరోసారి తాను వెళ్తున్న రోడ్డుపై పాము కనిపించేసరికి అంతా దానిచుట్టూ మూగడం చంపాలని చూడటంతో పామును పట్టుకుందామని సాయికిరణ్ ముందుకువెళ్లేసరికి అతన్ని వెనక్కు లాగేసి, అక్కడ ఉన్న వాళ్ళు పామును చంపేశారట. రెండు సంఘటనల వాళ్ళ, ఎలాగైనా పాముల్ని పట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని, హైదరాబాదులోని సైనిక్ పురి లో ఉండే పాములను సంరక్షించే సంస్థలో శిక్షణ తీసుకున్నాడట సాయి . అనుభవంతో ..తరువాత కాలంలో ఎన్నో పాములను పట్టుకున్నాడట. చిరంజీవి నాగార్జున పవన్ నాగబాబు వంటి ప్రముఖుల ఇళ్లలో పాములు పట్టడంతో పాటు , అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా రెండు మూడు సార్లు పాముల్ని పట్టుకున్నాడట. ఇలా ఇప్పటివరకూ సుమారు 3000కు పైగా పాములను పట్టుకున్నాడట సాయికిరణ్!! ఏహీరోకీ లేని విచిత్రమైన అలవాటు ఉన్న సాయి కిరణ్ కి, మీ ఇంట్లో పాములు పడ్డప్పుడు కూడా ఫోన్ చేస్తే వఛ్చి పట్టేస్తాడట. అదన్నమాట సంగతి.

Popular News


Current News

Back to Top
img