" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
నెలాఖరులో రోడ్లపైకి వజ్ర ఏసీ మినీ బస్సులు

Posted On - 11:Jan:2017 04:23:42 PM
.............................................................................. ..................................................................................

Share

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మినీ ఏసీ,నాన్ ఏసీ బస్సులను ప్రవేశ పెట్టబోతోంది . తెలంగాణరాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) వజ్ర ఎయిర్ కండీషనర్ మినీ బస్సులను ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ చేతులు మీదుగా ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు .

ఏసీ మినీ బస్సులలో సీట్ల సామర్ధ్యం 22 కాగా ,నాన్ఏసీ బస్సులలో సీట్ల సామర్ధ్యం 40 గా ఉంటుంది .మొత్తం 100 బస్సులను ఏర్పాటు చేస్తుండగా .ఇప్పటికే 60 బస్సులు టీఎస్ఆర్టీసీ కు చేరుకొన్నాయి .మిగిలిన బస్సులు కూడా ఈ నెల 25 లోపు సంస్థ చేతికి వస్తాయి .ఇప్పటికే ఈ బస్సులు ప్రయాణించే రూట్లను అధికారులు ఎన్నుకొన్నారు నాన్ ఏసీ బస్సులను గ్రామీణ ప్రాంతాలలో నడపడానికి ఏర్పాట్లు చేశారు .అంతక ముందే ప్రతిపాదించిన మూడు రూట్లలో వజ్ర బస్సులను నడపనున్నట్లు తెలిపారు .టీఎస్ఆర్టీసీ ఈ నెల 31 లోగ ఈ బస్సు సర్వీసులను ప్రారంభించటానికి ఏర్పాట్లు చేస్తుంది .

తొలి విడతగా హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్-నిజామాబాద్ రూట్లో వజ్ర ఏసీ మినీ బస్సులను ట్రయల్ రన్ ను నిర్వహిస్తారు .ఈ వజ్ర ఏసీ మినీ బస్సులు ప్రతిరోజు హైదరాబాద్-వరంగల్ రూట్లో 60 ట్రిప్పులు, హైదరాబాద్- నిజామాబాద్ రూట్లో 36 ట్రిప్పులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి .తొలిసారిగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులు ఇంటికి సమీపంలోనే బోర్డింగ్ పాయింట్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు .ప్రయాణికుల గమ్య స్థానాన్ని కూడా ఇంటికి దగ్గరలోనే సెలెక్ట్ చేసుకోవచ్చు .దీనివలన ప్రయాణికుడి కి బస్ స్టేషన్ కు రావడనికి అయ్యే ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు .

ఈ బస్సు లో హైదరాబాద్ నుండి వరంగల్కు రూ.300, హైదరాబాద్ నుండి నిజామాబాద్కు రూ. 350 చొప్పున ప్రయాణికుల నుండి చార్జిగా తీసుకోబోతున్నారు

Film News


Current News

Back to Top
img