" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
స్మార్ట్ అప్లికేషన్లతో ముందుకు వస్తున్న నోకియా

Posted On - 11:Jan:2017 04:09:13 PM
.............................................................................. ..................................................................................

Share

కొన్ని సంవత్సరాల క్రితం వరకూ ఫోన్ అంటే నోకియా తప్ప ఏ ఇతర కంపెనీ ఫోన్లను వాడేవారు కాదు .కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా నోకియా వినియోగదారులకు కొత్త ఫీచర్లను అందించటంలో వెనుకబడిపోయింది .ఇన్ని సంవత్సరాలు స్మార్ట్ ఫోన్ తయారీకి దూరంగా వున్నా నోకియా ఇటీవలే ఫిన్లాండ్ కంపెనీ హెచ్ఎండీ తో కలిసి నోకియా ‘నోకియా 6 ' స్మార్ట్ ఫోన్ ను తొలిసారిగా విడుదల చేసింది .
ఈ సంవత్సరంలో దాదాపు మరో 6 ఫోన్లను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది అయితే ఇప్పుడు నోకియా నుండి రాబోయే కొత్త ఫోన్ ల కోసం కొత్త అప్లికేషన్ ను రూపొందిస్తోంది. ‘వికి’ పేరుతో వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తుంది నోకియా .ఇప్పటికే యూరోపియన్ యూనియన్లో ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసింది .ఈ సంవత్సరంలో నోకియా విడుదల చేసే ఫోన్ లలో ఈ స్మార్ట్ అప్లికేషన్ ఉంటుంది .నోటితో మనం అడిగే ప్రశ్నలకు ఈ అప్లికేషన్ సమాదానాలు చెప్తుంది .
యాపిల్ తొలిసారిగా 2011లో ‘సిరి’ పేరుతో తీసుకొచ్చిన వాయిస్ అసిస్టెంట్ గ్యాడ్జెట్ ప్రియులను అమితంగా ఆకట్టుకొంది .తరువాత మైక్రోసాఫ్ట్ నుండి కార్టానా’.. అమెజాన్ ‘అలెక్సా’.. గూగుల్ ‘అసిస్టెంట్’ యాప్లూ వచ్చాయి.త్వరలోనే సామ్సంగ్ సొంతంగా వాయిస్ అసిస్టెంట్ యాప్ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది .ఇప్పటికే స్మార్ట్ ఫోన్ లతో తమ సత్తా చాటుకొంటున్న ఈ కంపెనీలతో నోకియా పోటీ పడటం అంటే సామాన్యమైన విషయం కాదు .

Film News


Current News

Back to Top
img