" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
అలవాటులో పొరపాటా ఇది లోకేశా?

Posted On - 11:Jan:2017 12:06:46 PM
.............................................................................. ..................................................................................

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పై సోషల్ మీడియాలో బోలెడన్ని జోకులు పేలుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తో లోకేష్ ని పోల్చుతూ , ఇద్దరూ వయసులో ఎదిగారు కానీ బుద్ధిలో ఎదగలేదు అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టే వారిద్దరి పనులూ ఉంటాయి.

ఇక అసలు విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిష్టర్ కు గాను ఒక ప్రత్యేక ట్విట్టర్ ఎకౌంట్ ఉంది. @AndhraPradeshCM పేరుతో ఆపరేట్ అయ్యే ఎకౌంట్ నుండి సిఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించి అనేక ట్వీట్లను రోజూ వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎకౌంట్ నుండి వచ్చిన ఒక ట్వీట్.. అటు రాజకీయ వర్గాలనే కాకుండా, సినీ రంగాన్ని కూడా ఆశర్చర్యంలో ముంచెత్తింది.

''బాలయ్య మావయ్య.. అలాగే ఇతర నటీనటుల పెర్ఫామెన్స్ చూసి నేను అబ్బురపడ్డాను. గౌతమీపుత్ర శాతకర్ణి టీమ్ కు శుభాకాంక్షలు'' అంటూ ఒక ట్వీట్ వచ్చింది. అక్కడ బాలయ్యను మావయ్యను అని అడ్రస్ చేయడం చూస్తే.. ట్వీట్ ను నారా లోకేష్ వేశారని ఎవ్వరికైనా ఇట్టే అర్దమైపోతుంది. కానీ ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం ఆంద్ర సి.ఎమ్ చంద్రబాబుది మరి. దాంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ట్విట్టర్ హ్యాండిల్ ను ఈయనే ఆపరేట్ చేస్తున్నారనే విషయం కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. దాంతో వెంటనే తేరుకున్న లోకేష్, ట్వీట్ ని డిలీట్ చేసి.. సదరు ట్వీట్ ను తన ఎకౌంట్ అయిన @naralokesh నుండి మరో ట్వీట్ చేసాడు. దాంతో సోషల్ మీడియాలో జనాలు అందరూ ఇది అలవాటులో పొరపాటు అయి ఉంటుంది అని కామెడీ చేస్తున్నారు. పరధ్యానం లో ఉంటె ఇలాంటి అవమానాలే జరుగుతునాయి అని లోకేష్ ఎప్పుడు తెలుసుకుంటాడో మరి.

 

 

Film News


Current News

Back to Top
img