" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
ఫేస్బుక్ ఆఫీసులో చెర్రీ చిందులు అదుర్స్

Posted On - 11:Jan:2017 12:05:59 PM
.............................................................................. ..................................................................................

Share

ఒక "సినిమా షూటింగ్స్ చూసుకుంటూ, మధ్యలో కొత్త సినిమా కథలు వింటూ , మరో వైపు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న నూట యాభయ్యో చిత్రం "ఖైదీ నంబర్ 150 " సినిమా నిర్మాణ పనులని పర్యవేక్షిస్తూ, గత ఏడూ ఎనిమిది నెలల నుండి ఏమాత్రం విరామం తీసుకోకుండా పనిచేస్తూ వస్తున్నాడు రాంచరణ్ తేజ్. అయినా కానీ, తన తండ్రి సినిమా ప్రమోషన్స్ లో కూడా చురుకుగా పాల్గొంటూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు . 

తాజాగా, హైద్రాబాద్ ఫేస్ బుక్ ఆఫీస్ నుంచి అరగంటకు పైగా లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్.. ఎపిసోడ్ ను ఫేస్ బుక్ లోని తన పేజ్ లో లైవ్ టెలికాస్ట్ చేయడమే కాదు.. వీడియోను స్పెషల్ గా పోస్ట్ చేశాడు కూడా. దాదాపు మొదటి అరగంట పాటు.. చిరు గురించి.. చెర్రీ గురించి ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి.. డిస్కషన్ లో పాల్గొన్న చరణ్.. తర్వాత అసలు హడావిడి చేసాడు. తండ్రి జీన్స్ నుండి అబ్బిన అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్ ని ఫేస్బుక్ ఉద్యోగులకి రుచి చూపించాడు. ఈవెంట్లో పాల్గొన్న అమ్మాయి.. చెర్రీతో కలిసి డ్యాన్స్ చేయాలని అడగడంతో.. ఓకే చెప్పేసిన చెర్రీ.. నలుగురు అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేశాడు.

'అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు' సాంగ్ కోసం నలుగురు అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ వేసిన చెర్రీ.. అమ్మాయి వేస్తున్న స్టెప్స్ వేస్తున్న ఈజ్ చూసి.. నేనలా చేయలేను అనేసరికి అందరూ గొల్లున నవ్వేశారు. . చివరకు అమ్మాయిలతో కలిసి సింపుల్ స్టెప్స్ వేస్తూ అందరినీ ఉత్సాహంలో నింపేశాడు. లేక లేక పెట్టిన లైవ్ ఫీడ్ అవ్వడంతో, లక్షల్లో హిట్స్ వచ్చాయి .

 

 

Film News


Current News

Back to Top
img