" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
మెగాస్టార్ కి అతిపెద్ద ఫ్లెక్షీ కడుతున్న పవర్స్టార్ ఫ్యాన్స్?

Posted On - 11:Jan:2017 12:05:12 PM
.............................................................................. ..................................................................................

Share

గత రెండు మూడేళ్ళుగా , మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి, అన్న దమ్ములు ఇద్దరూ ఒకరంటే ఒకరికి పడనంత ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు అని ఏవేవో రూమర్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. దాంతో, చిరు - పవన్ ఫయాన్స్ మధ్య కూడా సఖ్యత చెడింది అని కూడా చెప్పుకున్నారు. కానీ, పవన్ సినిమా కానీ - చిరు సినిమా కానీ విడుదల అవుతోంది అన్నప్పుడు మాత్రం అంటా ఒకటైపోతారు అన్న విషయం మరోసారి రుజువైంది. ఎందుకంటే, చిరు తాజా సినిమా "ఖైదీ నంబర్ 150" విషయంలో పవన్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా చూస్తే.. ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే.

తాజా సమాచారం ప్రకారమా, "ఖైదీ నంబర్ 150" కి విశాఖలో అతి పెద్ద ఫ్లెక్సీని కట్టేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. సుమారుగా 104 అడుగుల వెడల్పు.. 38 అడుగులు ఎత్తుతో.. ఒక భారీ సైజు ఫ్లెక్సీని పవన్ ఫయాన్స్ డిజైన్ చేయించారు. వైజాగ్ లో విమాక్స్ లో ఈ ఫ్లెక్సీ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం ఓ భారీ క్రేన్ రెంట్ కి తీసుకొచ్చి మరీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మొత్తం విమాక్స్ థియేటర్ వాల్ అంతా కవర్ అయిపోయే రేంజ్ లో ఫ్లెక్సీని డిజైన్ చేయించారంటే.. మెగా క్రేజ్ ఈ ఏరేంజ్ లో ఉందొ మనం అర్ధం చేసుకోవచ్చూ.

ఈ హడావిడి అంట కేవలం వైజాగ్ కె పరిమితం అనుకుంటే పొరబడినట్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఇప్పుడు ఇదే సందడి. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటికే వీర రేంజ్ లో ఖైదీ కోసం ఏర్పాట్లు చేసేస్తున్నారు. రేపు ఒక్క రోజు రాష్ట్రంలోని దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలోనూ మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రదర్శితం కానుందనే విషయం తేలిపోయింది. తొలి రోజు రికార్డుల విషయంలో.. ఇండస్ట్రీ హిట్ పై కన్నేసిన మెగాఫ్యాన్స్.. అందివచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేరు. తొమ్మిదేళ్ల తరువాత తేరా మీద మెరవబోతున్న మెగాస్టార్ ముందు ఇక ఎన్ని రికార్డులు మోకరిల్లనున్నాయో మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది.

 

Film News


Current News

Back to Top
img