" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
భకిత్ మార్గంలో నడుస్తున్న భల్లాలదేవుడు

Posted On - 10:Jan:2017 08:50:19 PM
.............................................................................. ..................................................................................

Share

క్షణంలో అయితే "బాహుబలి" సినిమాకి సంతకం చేసాడో కానీ, దెబ్బకి దగ్గుబాటి రానా దశ తిరిగిపోయింది. అప్పటి వరకు ఏవో సినిమాలు చేస్తూ నెట్టుకొచ్చ్చిన కుర్ర హీరో సూది, "బాహుబలి" తో బ్రహ్మాండంగా తిరిగిపోయింది అనే చెప్పాలి. ఎన్నడూ లేనంత బిజీ అయిపోయాడు రానా. అటు హిందీ, ఇటు తెలుగు, మధ్యలో తమిళ సినిమాల ఆఫర్లతో బిజీగా ఉన్నా, ప్రస్తుతానికి రానా కేవలం తెలుగు మరియు హిందీ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది. ప్రభాస్, అనుష్క కంటే ముందుగానే " బాహుబలి 2 " మూవీకి గాను తన భాగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న రానా, తరువాత ఒప్పుకున్న సినిమాలని కూడా చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. క్రమంలో ఇప్పటికే ఇండియాలో తొలిసారిగా సబ్ మెరైన్ థీమ్ తో వస్తున్న ఘాజీ చిత్రానికి ఫస్ట్ లుక్ తో పాటు.. పోస్టర్ ను కూడా లాంఛ్ చేసిన రానా.. మరోవైపు తేజ దర్శకత్వంలో చేస్తున్న సినిమాని కూడా యమా స్పీడ్ గా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

తేజ సినిమా షూటింగ్ ఇటీవలే తమిళనాడులో షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న తర్వాత.. అనంతపురం జిల్లాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. జనాల మధ్యలో పొలిటికల్ లీడర్ గా రానా నడుచుకుంటూ వస్తున్న పిక్స్ ఇప్పటికే ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. తరువాత ఇప్పుడు కర్నూలు జిల్లాలో పుణ్యక్షేత్రాల్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో ఉన్నారు రానా-తేజ టీం. ప్రముఖ పిల్గ్రిమేజ్ స్నేతర్లు అయిన బనగానపల్లి .. యాగంటి.. మహానంది ప్రాంతాల్లో కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది అని సమాచారం.

తాజాగా, మహానందిలో రానా అండ్ టీం షూటింగ్ చేసిన పిక్స్ ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. మూవీలో రానాకి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, వేసవి లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

 

 

 

Film News


Current News

Back to Top
img