" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ 'జుద్వా' పేరుతో సల్మాన్ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు. ..!   ♣ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ఇచ్చిన మరో ట్విస్టు ..!   ♣ వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఎయిర్టెల్-టెలినార్ ను కొనుగోలు .. ..!   ♣ ఐదు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం ..!   ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!
img
img
అమెరికాలో కూడా చిరు అభిమానుల రచ్చ
Posted On - 10:Jan:2017 08:46:28 PM
.............................................................................. ..................................................................................

Share

అయన సినిమాలని వదిలేసి దాదాపు పదేళ్ళయింది. ఇన్నేళ్ల తరువాత మళ్ళీ మొహానికి రంగు వేసుకుని కెమెరా ముందుకి వచించినా, అభిమానుల్లో ఇప్పటికీ అదే క్రేజ్. అద్భుతమైన ఫాలోయింగ్ కేవలం మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సాధ్యం అని చెప్పడంలో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు. చిరు రీ ఎంట్రీ పై కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే హడావిడి జరుగుతూ ఉంది అనుకుంటే పొరపాటే. మెగాస్టార్ తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" సినిమా విడుదల సందర్భంగా , ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ విదేశాలలో స్థిరపడ్డారు. అందులోనూ అమెరికాలో సెటిల్ అయినా చిరు ఫ్యాన్స్ సంఖ్యా వేలల్లోనే ఉంటుంది. ఇప్పుడు వారంతా బాగా సంపాదిస్తున్నారు కూడా.

అదలా ఉంటె, చిన్నప్పుడు తల్లిదండ్రుల భయానికో, మరి దేనికో ...ఎదో ఒక కారణం చేత తమ అభిమానాన్ని గట్టిగా చాటుకోలేని బ్యాచ్ అంతా ఇప్పుడు చూపిస్తున్నారు. అమెరికాలో ప్రసిద్ధిగాంచిన ఒమాహాలో చిరు ఫ్యాన్స్ అందరు దాదాపు ఒక 30 కాస్ట్లీ కార్లతో ర్యాలీ నిర్వహించారు. తమ అభిమానాన్ని మొదటిరోజు టిక్కెటుతో తీర్చుకోలేమని చూపించారు.

ఒక స్పెషల్ వీడియో చేసి, ఫ్లయ్ క్యామ్స్ ఉపయోగించి మరీ మంచి వీడియో ఒకటి తీశారు. సినిమా రేంజ్ టేకింగ్ తో తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. వీడియో అంతా ఒక ఎత్తైతే , వీడియో చివర్లో అన్ని కార్లూ కలిపి ఆంగ్ల భాషలో చిరు అని వచ్చ్చేలా పెట్టిన తీరు నిజంగా అద్భుతం అనే చెప్పాలి. "బాస్ ఈజ్ బ్యాక్ " అంటూ యువత చేసే నినాదాలతో రేపు థియేటర్లన్నీ దద్దరిల్లనున్నాయి.

 

 

 

Popular News


Current News

Back to Top
img