" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
మంచు విష్ణుకి మర్యాదగా వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు

Posted On - 10:Jan:2017 03:05:53 PM
.............................................................................. ..................................................................................

Share

టాలీవుడ్ లో ముక్కుసూటిగా మాట్లాడేవాడు, సమయపాలన కి మారు పేరు, విలక్షణ నటనకి కేరాఫ్ అడ్రెస్ , తన పర బేధం లేకుండా తప్పు ఎవరు చేసినా కడిగి పాడేసేవాడు ఎవరయ్యా అంటే , ప్రతి ఒక్కరి మదిలో మెదిలే మొదటి పేరు , లేదా ఏకైక పేరు డైలాగ్ కింగ్ డా: మంచు మోహన్ బాబు. తన మనసులో ఏమున్నా మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం మోహన్ బాబు ప్రత్యేకత. ఇక తన కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేసినా, తనకి కావాలన్నా వాళ్ళెవరైనా తప్పు చేసినట్టు తన దృష్టికి వచ్చినా మోహన్ బాబు ఎవరినీ ఉపేక్షించారు. ఆఖరుకి అది తన కన్న బిడ్డలైనా సరే. విలక్షణతే మోహన్ బాబుకి అసంఖ్యాకమైన అభిమానవులని సంపాదించి పెట్టింది. నటుడిగా మోహన్ బాబు ఎంత గొప్పో అందరికి తెలిసిన విషయమే. కానీ, మోహన్ బాబు దగ్గర నుండి ఒక మనిషి ఎలా ఉండాలి...నలుగురిలో తన నడవడిక ఎలా ఉండేలా చూసుకోవాలి అన్నది మాత్రం అయన దగ్గర నుండి కచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలు.

ఇక అసలు విషయానికి వస్తే, ఇటీవలే విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న యువ హీరో నిఖిల్ సినిమా "ఎక్కడకి పోతావు చిన్నవాడా" సినిమా ఆడియో వేడుకకి మంచు విష్ణు గెస్ట్ హాజరయ్యాడు. సందర్భంగా విష్ణు మాట్లాడుతూ, నేను మాముడూలుగా నా సినిమా ఫంక్షన్స్ కే నేను వెళ్ళాను. అలాంటిది ఇక వేరే హీరోల సినిమా ఫంక్షన్స్ కి అసలు వెళ్లే అలవాటు లేదు. కాబట్టి ఇంకోసారి నన్ను ఎలాంటి ఆడియో వేడుకలకి పిలవద్దు అని నిఖిల్ ని ఉద్దేశించి అన్నాడు.

ఇదే విషం గురించి మోహన్ బాబు మంచు విష్ణు కి పబ్లిక్ గా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు తాజాగా మంచు విష్ణు హీరోగా నటించిన "లక్కున్నోడు" చిత్ర ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా విచ్ఛేసిన మోహన్ బాబు పబ్లిక్ కొడుకుని తన ప్రవర్తన సరికాదు, ఆలా మాట్లాడటం తప్పు అంటూ మందలించాడు. అదేమిటో మోహన్ బాబు మాటల్లోనే చూద్దాం .

"విష్ణు.. వాంట్ టు గివ్ యు వార్నింగ్ ఫర్ యు.. ఇట్స్ వార్నింగ్.. పబ్లిక్ చూస్తున్నారు. భార్య.. ఇద్దరు బిడ్డలు ఉన్నవాడివి.. మధ్యనే టీవీల్లో చూశాను. పదిమంది ఎదుట ఉన్నపుడు పదిమందిలో నువ్వు చేసిన తప్పు చెప్పాలి. 'నేను సహజంగా నా ఆడియోకి కూడా వెళ్లను' అని ఎక్కడో ఫంక్షన్ లో అన్నావు. అది తప్పు. నీ ఆడియో ఫంక్షన్ కి నువ్వు వెళ్లాలి. పదిమంది హీరోలు నిన్ను ప్రేమగా పిలిచినపుడు వారి ఆడియో ఫంక్షన్ కి వెళ్లాలి. అంతేకానీ నా ఆడియో ఫంక్షన్ కూడా నేను వెళ్లను అని కొంతమంది హీరోల్లాగా డబ్బాలు కొట్టుకోవద్దు. అర్ధమైందా.. బీ సిన్సియర్.. సిన్సియర్ గా ఉన్నపుడే అన్నీ ఉంటాయ్ మనకి.. డబ్బాలు వద్దు మనకు" అంటూ కొడుకు విష్ణుకు సున్నితంగానే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మోహన్ బాబు.

ఇకపోతే, సినిమాకోసం ప్రతి ఒక్కరూ ఏంటో కష్టపడ్డారు అని, ముఖ్యంగా దర్శక నిర్మాతలని నేను అభినందిస్తున్నా అని మోహన్ బాబు చెప్పారు. లక్కున్నోడు ఆడియో విడుదల వేడుకలో సంఘటన జరగగా.. సినిమాకోసం ప్రతీ ఒక్కరూ కష్టపడ్డారని అభినందించారని.. ముఖ్యంగా దర్శక నిర్మాతలను అభినందిస్తున్నానని చెప్పారు మోహన్ బాబు. ఏదేమైనా విష్ణు మాటలతో చిన్నబుచ్చుకున్న నిఖిల్ పెదాలపై , మోహన్ బాబు విష్ణుకి పీకిన క్లాస్ కాస్తో కూస్తో నవ్వుల్నీ పూయించే ఉంటుంది...ఏమంటారు?

 

 

 

 

Film News


Current News

Back to Top
img