" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
"ఖైదీ.." లో కూడా వీణ స్టెప్ ఉంటుందా?

Posted On - 10:Jan:2017 10:42:22 AM
.............................................................................. ..................................................................................

Share

ఇటు టాలీవుడ్ అటు సినీ ప్రేమికులంతా సంక్రాంతికి ప్రధానంగా ఎదురుచూస్తున్న మూడు సినిమాలు "ఖైదీ నెంబర్ 150", " గౌతమీపుత్ర శాతకర్ణి" మరియు యువ హీరో శర్వానంద్ నటించిన "శతమానం భవతి". ఇందులో, చిరు "ఖైదీ" కి అన్నిటికంటే ఎక్కువ హైప్ వచ్చింది. తొమ్మిదేళ్ల తరువాత మెగాస్టార్ నటించబోతున్న సినిమా కావడమే అందుకు కారణం.

మరో రోజు గ్యాప్ లో ఫ్యాన్స్ ముందుకు రాబోతున్న సినిమా పైన మెగా ఫ్యాన్స్ కి అంచనాలు చాలానే ఉన్నాయి. చిరు అనగానే ముడుగు అందరి మెదళ్ళ లో మెదిలేది చిరు స్టెప్స్ అని వేరే చెప్పక్కర్లేదు. కానీ, ఇదివరకుల ఇప్పుడు అరవై ఏళ్ల వయసులో చిరు రేంజ్ లో డ్యాన్స్ చేసాడో....అనే ఒక ఆరాటం అందరిలోనూ ఉంది. అయితే, ఫ్యాన్స్ ఖుషీ చేసుకునే విధంగా సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి చిరు స్వయంగా వెల్లడించాడు.

తన "ఇంద్ర" సినిమాలో ఎంతో పాపులర్ అయిన వీణ స్టెప్, ఇప్పుడీ "ఖైదీ.." లో రిపీట్ చేసినట్టు చిరు మీడియా ముఖంగా వెల్లడించాడు. 
మొదట స్టెప్ వేయడానికి తాను నిరాకరించానని, కానీ లారెన్స్ పట్టుపట్టి మరీ తనతో స్టెప్ మళ్లీ వేయించాడని చిరు చెప్పుకొచ్చాడు. దాంతో పాటు సినిమా అంతటా డ్యాన్సులు అభిమానుల్ని ఆకట్టుకుంటాయని చిరు చెప్పాడు. చిరు-లక్ష్మీరాయ్ కాంబినేషన్లో తెరకెక్కిన రత్తాలు రత్తాలు పాటకు లారెన్స్ డ్యాన్స్ కంపోజ్ చేయగా.. ఇంకో రెండు పాటలకు శేఖర్ మాస్టర్.. జానీ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. వీటిలో పాటకు పాట ప్రత్యేకంగా ఉంటుందని.. మెగాస్టార్ డ్యాన్సులు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయిన చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మిగత కథ ఇక తెర మీద చూడటానికి రెడీ అయ్పొంది మరి.

 

 

 

Film News


Current News

Back to Top
img