" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ 'జుద్వా' పేరుతో సల్మాన్ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు. ..!   ♣ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ఇచ్చిన మరో ట్విస్టు ..!   ♣ వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఎయిర్టెల్-టెలినార్ ను కొనుగోలు .. ..!   ♣ ఐదు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం ..!   ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!
img
img
"ఖైదీ.." సినిమాకి అడిరిపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్
Posted On - 10:Jan:2017 10:36:20 AM
.............................................................................. ..................................................................................

Share


లేక లేక తొమ్మిది సంవత్సరాల తరువాత కోట్లాది మెగా అభిమానుల కోరిక మన్నించి , రాజకీయలకి విరామం ఇచ్చి మళ్లీ మేకప్ వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి మరో రెండు రోజుల్లో "ఖైదీ నంబర్ 150 " గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న శుభ సందర్భంలో , రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. థియెట్ర్ చూసినా ఆకాశాన్ని అంటే విధంగా పెద్ద పెద్ద కటౌట్స్, గజ మాలలు...రిబ్బన్లు...అబ్బో, ఒకటేమిటి.....తమ ఆరాధ్య దైవానికి ఘనంగా స్వాగతం పలకడానికి అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

విడుదల కి సరిగ్గా రెండు రోజుల సమయం కూడా లేకపోవడంతో, ఇప్పటికే లక్షలాది చిరు అభిమానులు పోటీ పడి మరీ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్న తీరు చూస్తుంటే.. ట్రేడ్ జనాలకు కూడా దిమ్మ దిరిగి బొమ్మ కనిపిస్తోంది. అలా ఆన్ లైన్ లో టికెట్స్ పెట్టడం ఆలస్యం.. ఇలా హౌస్ ఫుల్స్ పడిపోతున్నాయి. ఒక్క సింగిల్ స్క్రీన్స్ మాత్రమే కాదు, మల్టీప్లెక్సుల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. పరిస్థితి ఎలా ఉంది అంటే, జనవరి 11 రాష్ట్రం మొత్తం అన్ని థియేటర్లలోనూ ఖైదీ నంబర్ 150ని ప్రదర్శించినా సరే టికెట్స్ ఇప్పుడే సేల్ అయిపోయేట్లుగా ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఒక పక్క జనవరి 12 శాతకర్ణి.. 14 శతమానం భవతి రిలీజ్ అవుతుండడంతో.. ఆయా థియేటర్లలో కూడా 11 ఖైదీనే ప్రదర్శిస్తున్నారు. బెజవాడలో అన్ని మల్టీప్లెక్స్ లు కలిపి రోజుకు 135 షోలు వేయగలరు. అన్నీ ఖైదీ నంబర్ 150నే వేసేస్తున్నా సరే.. ఇప్పటికే అన్ని షోస్ ఫుల్స్ అయిపోయాయి.

హైదరాబాదీ విషయానికి వస్తే, ప్రసాద్స్ లో 33.. ఇనార్బిట్ లో23.. ఫోరం మాల్ లో 34.. పీవీఆర్ లో 13.. మంజీరా మాల్ లో 17.. అత్తాపూర్ 19.. అన్నీ చిరంజీవి మూవీనే వేస్తున్నారు. అన్నిటికీ టికెట్స్ అయిపోయాయి కూడా. మొదటి రోజే కాదు.. దాదాపు వీకెండ్ వరకూ ప్రైమ్ టైమ్ షోస్ కి టికెట్స్ దొరకని పరిస్థితి. మెగాస్టార్ మేనియా అంటే ఏమిటో ఇన్నాళ్లూ తెలియని వారు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటేనే ఇప్పుడు తెలుసుకోవచ్చు. మొదటి బొమ్మ పడ్డాక ఇక మెగా ఫ్యాన్స్ ఉత్సాహం రేంజ్ లో ఉంటుందో కనీసం ఊహకి కూడా అందటం లేదు.

 

 

 

Popular News


Current News

Back to Top
img