" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
నాగార్జునని ఆకాశానికి ఎత్తేసిన దర్శకేంద్రుడు

Posted On - 10:Jan:2017 10:35:20 AM
.............................................................................. ..................................................................................

Share

పాతికేళ్లకి పైగా కెరీర్లో ఒక నటుడికి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉంటాయి. రకరకాల దర్శకులతో పనిచేయడం వల్ల, సీన్ ని ఎలా పండించాలి..... ఎమోషన్ ని ఎలా మొహం లో పలికించాలి.... డైలాగు ఎలా చెబితే బాగుంటుంది అన్నది ఒక స్టేజ్ కి వచ్చాక వేరెవరూ నటుడికి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి పొజిషన్ లోనే ఉన్నాడు నాగార్జున అంటున్నాడు ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు. 
కింగ్ నాగార్జున తో ఆయన తాజాగా చేసిన సినిమా "ఓం నమో వెంకటేశాయ" సినిమా సందర్భంగా , తాను చెప్పిందే తడవుగా నాగార్జున ఎలా అల్లుకుపోయేవాడో గుర్తు చేసుకుంటూ నాగ్ ని దర్శకేంద్రుడు ఆకాశానికి ఎత్తేశాడు.

మాస్ సినిమాలు, రొమాంటిక్ సినిమాలు చేస్తున్న నాగార్జునాని కష్టపడి ఒప్పించి, ఎవరూ ఊహించని విధంగా రాఘవేంద్రరావు "అన్నమయ్య" గా తెలుగు ప్రేక్షకుల ముందుకి తెచ్చాడు. ...నాగార్జున అన్నమయ్య గా ఏం చేస్తాదులే అని పెదవి విరిచిన వారంతా నోళ్ళు వెళ్ళబెట్టేలా నాగార్జున నటన "అన్నమయ్య"లో అబ్బురపరిచింది. తరువాత మళ్లీ కొన్నేళ్ళకి అదే నాగార్జునతో రాఘవేంద్రరావు "శ్రీరామదాసు" చేశాడు. ఆపైన మధ్య కాలంలో "శిరిడిసాయి" సినిమా చేసి మరోసారి అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఇప్పుడు మరోసారి భక్తిరస చిత్రం "ఓం నమో వెంకటేశాయ" తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సందర్భంగా దర్శకేంద్రుడు నాగార్జున గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాతో వెల్లడించాడు. భక్తిరస చిత్రాల "అన్నమయ్య" దగ్గర నుండి ప్రస్తుత చిత్రం దాకా నటుడిగా నాగార్జున ఎంత పరిణతి సాధించాడో వివరించాడు.


‘‘
అన్నమయ్య సినిమా చేసే సమయానికి నాగార్జునకి తరహా భక్తిరస చిత్రాలు చేసిన అనుభవం లేకపోవడం తో సన్నివేశం ఎలా చేయాలి అని అడిగేవాడు. ఇలా చెయ్యి పెట్టు బాబు.. ఇలా దండం పెట్టు అని నేను చెప్పేవాణ్ని. తర్వాతశ్రీరామదాసుసమయానికి ఎలా చేయమంటారు అని అడగలేదు. ఏం డైలాగ్ చెప్పమంటారు అని అడిగేవాడు. ‘ఓం నమో వేంకటేశాయసినిమా విషయానికి వస్తే.. అక్కడ వేంకటేశ్వరస్వామి ఉన్నాడు.. వెళ్లి ఇలా డైలాగ్ చెప్పు అంటుంటే.. నాకర్థమైందండీ ఎలా చేయాలో తెలుసు అంటూ నా మాట పూర్తి కాకముందే వెళ్లి సన్నివేశాలు పూర్తి చేసేసేవాడు. భక్తుడి పాత్రను చేయడంలో నాగార్జున అంత పరిణతి సాధించాడు. సినిమాలో దేవుణ్ని చూసేటపుడు నాగార్జున తన కళ్లతో ఇచ్చిన హావభావాలు చూస్తే.. నిజంగానే తన ముందు దేవుడున్నాడనే అనిపించేది. ప్రేక్షకులందరూ నాగార్జున కళ్లతో సినిమా చూడాలి. అందరికీ నిజంగానే దేవుడు కనిపిస్తాడు. అంత గొప్పగా నటించాడు నాగ్’’ అని రాఘవేంద్రరావు అన్నారు.

విషయాన్నైనా త్వరగా నేర్చెసుకునే నాగ్ గురించి రాఘవేంద్రరావు చెప్పిన విషయాలానీ, ముచ్చట్లని బట్టి చూస్తే అభిమానులు "ఓం నమో వెంకటేశాయ" చిత్రం కోసం ఆగేలా లేరు మరి. మరోసారి తెలుగు కుటుంబాలని మైమారపించేందుకు రంగం సిధమవుతున్నట్టే ఉంది కదూ చూడబోతే?

 

 

Film News


Current News

Back to Top
img