" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
కరణ్ జోహర్ పై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు

Posted On - 10:Jan:2017 04:49:27 AM
.............................................................................. ..................................................................................

Share

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ పై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు పేలుతుంటాయి.  కరణ్ జోహర్ ఏనాడూ వాటిపై స్పందించలేదు. అయితే తన అభిప్రాయాలను  'ది అన్ సూటబుల్ బాయ్' పేరుతో త్వరలో విడుదల కానున్న తన ఆత్మ కథలో  ఆయన నిర్మొహమాటంగా వెల్లడించారు. అందులోని కొన్ని విషయాలు తాజాగా వెలుగు చూశాయి. వాటి వివరాల్లోకి వెళ్తే... ‘సెక్స్గురించి నిర్మోహమాటంగా మాట్లాడితే జైల్లో పెట్టే దేశంలో ఉన్నాను. అందుకే విషయాల గురించి ఎక్కువగా మాట్లాడను. సెక్స్అనేది పూర్తిగా వ్యక్తి గతమైనది. నా సెక్స్జీవితం గురించి రకరకాల ఊహాగానాలున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన బంధం మీద షారూక్ఖాన్తో ఎన్నో వదంతులున్నాయని, తనను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి షారూఖ్ తో తనది అనూహ్యమైన బంధమని వ్యాఖ్యానించాడని తెలిపాడు. వెంటనే తనకు చాలా కోపం వచ్చిందని, క్షణం ఆలస్యం చేయకుండానువ్వు నీ సోదరుడితో పడుకుంటున్నావు అని నేను అంటే ఎలా ఉంటుందని అడిగానని, దానికి ఆయనఇలాంటి ప్రశ్నను ఎలా అడుగుతున్నారు?’ అని అన్నాడని తెలిపాడు. ‘అలాంటప్పుడు నన్ను మీరెలా అడగగలిగారు?’ అని వెంటనే తాను కూడా అడిగానని షారుక్తనకు తండ్రిలా, పెద్దన్న లాంటి వాడని , ఇలాంటి పుకార్లను షారూఖ్ పట్టించుకోడని అన్నాడు. పోనీ తాను స్పందిద్దామని ప్రయత్నించినా జనం నోటికేదొస్తే అది మాట్లాడతారని, వివాహేతర సంబంధాలు లేకపోతే స్వలింగసంపర్కుడిగా ముద్రవేస్తారని ఊరుకున్నానని చెప్పాడు. అయితే తానింతకు ముందెప్పుడూ సెక్స్గురించి మాట్లాడలేదని, తాను హెట్రోసెక్సువల్నా, హోమో సెక్సువల్నా, బైసెక్సువల్నా అన్నది పూర్తిగా తన వ్యక్తిగతమైన అంశమని స్పష్టం చేశాడు. తన సెక్స్జీవితం గురించి చాలామంది జోకులేస్తుంటారని చెప్పిన కరణ్ జోహర్, తానిప్పుడు హోమోసెక్సువాలిటీకి పోస్టర్బాయ్గా మారిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే దీనికి తాను బాధపడడం లేదని తెలిపాడు.

Film News


Current News

Back to Top
img